నాంపల్లి క్రిమినల్ కోర్టులు, జూలై 31 (నమస్తే తెలంగాణ) : ఫార్ములా ఈ-కార్ రేస్ కే సులో శుక్రవారం నాంపల్లిలోని ఏసీబీ కోర్టుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. ఆయనతోపాటు ఐపీఎస్ అధికారి అరవింద్‌కుమార్, హెచ్ఎండీఎ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి, స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వర్ పేర్లను కోర్టు పిలిచింది. ఏ-5 గా ఉన్న ఓ సంస్థకు చెందిన వ్యక్తి గైర్హాజరుకావడంతో మరోసారి సదరు కంపెనీకి సమ న్లు జారీచేయాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. ఈ కేసులో ఉన్న నలుగురి తరఫున వేర్వేరుగా వకాల్తాలను న్యాయవాదులు దాఖలు చేశారు.
కేటీఆర్ తరఫున ఉమామహేశ్వర్‌రావుతోపాటు బీఆర్ఎస్ లీగల్‌సెల్ న్యాయవాది కిరణ్‌కుమార్, ఇతర న్యాయవాదుల పేర్లను జో డించి వకాల్తా దాఖలు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు ఈ కేసుకు సంబంధించిన పత్రాలను నలుగురు నిందితులకు అందించారు. కేటీఆర్ తరఫున లక్ష చొప్పున రెండు పర్సనల్ బాండ్ పై సంతకం చేసి ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు సమర్పించారు. వచ్చే వాయిదాకు రూ.25 వేల చొప్పు న ఇద్దరి జమానత్‌లను కోర్టుకు అందించాలని ఏసీబీ జడ్జి సూచించారు. తదుపరి విచారణను వచ్చే నెల 25కు వాయిదా వేసింది. వచ్చే వాయిదా నుంచి విచారణ ప్రారంభం కానున్నది. కేసు విచారణ ముగిసిన అనంతరం కేటీఆర్ కోర్టు బయటికి వస్తున్న సమయంలో జై కేటీఆర్.. జై కేటీఆర్ అన్న నినాదాలతో పరిసర ప్రాంతాలు మారుమోగాయి.