కుత్బుల్లాపూర్: దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లంపేటలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. తల్లితోపాటు బాలుడు స్కూలుకు వెళ్తుండగా.. వారు ప్రయాణిస్తున్న స్కూటీని టిప్పర్ ఢీకొట్టింది. దీంతో కింద పడిన బాలుడి పైనుంచి టిప్పర్ వెళ్లింది. ప్రమాదంలో బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు.