ASHA Workers | హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్( GHMC ) పరిధిలో ఆశా వర్కర్ల( ASHA Workers ) నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జీహెచ్ఎంసీ పరిధిలో 1,540 ఆశా వర్కర్ల పోస్టుల భర్తీకి అనుమతిస్తూ వైద్యారోగ్య శాఖ( Health Dept ) ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్( Hyderabad ) పరిధిలో 323, మేడ్చల్( Medchal )లో 974, రంగారెడ్డి( Rangareddy ) పరిధిలో 243 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఆశా వర్కర్లను జిల్లా సెలక్షన్ కమిటీ ద్వారా ఎంపిక చేయనున్నారు.
Asha Telangana