ఈ ఏడాది సోషల్ మీడియాలో చురుకుదనం మందగిస్తుంది. గట్టిగా పోస్ట్ పెట్టలేరు. మెత్తగా కామెంట్చేయలేరు. ఆశించిన లైకులు, షేర్లు రాలేదని కొత్త పోస్ట్‌లు అప్లోడ్ చేస్తుంటారు. వాటికీ స్పందన రాకపోవడంతో నిరుత్సాహానికి గురవుతారు. మత, రాజకీయ విషయాలపై స్పందించకపోవడం మంచిది. నొప్పింపక తానొవ్వక అన్న సూత్రాన్ని పాటించండి.
కళలను ఆరాధించడమే కానీ, ప్రదర్శించడంలో మాత్రం ఈ ఏడాది అంతగా కలిసిరాదు. గ్రహగతుల ప్రభావం సామాజిక మాధ్యమాల్లో మీకు అనుకూలంగా పరిణమిస్తుంది. ఫాలోవర్స్ సంఖ్య అమాంతం పెరిగే అవకాశం ఉంది. మీరు ఊసుపోక చేసిన వీడియోలు కూడా వైరల్ అవుతాయి. ఇన్స్టాగ్రామ్, ట్విటర్ తదితర ప్లాట్‌ఫామ్స్‌ను సమర్థంగా హ్యాండిల్ చేస్తారు.
ఈ ఏడాది సామాజిక మాధ్యమాల్లో మీ వైఖరి గతేడాదికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. కొత్త ప్రయత్నాలు చేస్తారు. వివిధ యాప్‌లను ఉపయోగిస్తూ మీలో ఉన్న కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తారు. అయితే, అతిగాఫోన్ వాడటం వల్ల మెడ, కండ్లకు సంబంధించిన సమస్యలు ఎదురవ్వొచ్చు. సమయపాలన పాటించండి. వాట్సాప్ కుటుంబ సభ్యుల గ్రూపుల్లో సరదా కామెంట్లు చికాకులు కలిగించవచ్చు.
సామాజిక మాధ్యమాల్లో ఈ రాశివారి పోస్టుల్లో ఎలాంటి మార్పులూ ఉండవు. డేటింగ్ యాప్‌ల జోలికి వెళ్లి చేతులు కాల్చుకునే ప్రమాదం ఉంది. టెక్నాలజీని గుడ్డిగా నమ్మి బోల్తాపడకండి. రుణయాప్‌ల జోలికీ వెళ్లకండి. మీ వ్యక్తిత్వానికి నప్పే సందేశాలు పోస్ట్ చేసినంత కాలం ఎలాంటి చికాకులూ ఉండవు. కాస్త కొత్తగా ప్రయత్నిద్దాం అనుకొని ప్రయోగాలు చేస్తే మాత్రం బెడిసికొట్టే ప్రమాదం ఉంది.
మీరు పెట్టే పోస్టులకు ఎన్ని లైకులు వస్తాయో.. అన్ని డిస్లైక్లూ వచ్చిపడతాయి. వారికి మీరు పెట్టిన పోస్ట్ అర్థం కాలేదనుకొని ఊరుకోవడం మంచిది. అలాకాదని, వాదనకు దిగితే చివరికి మిగిలేది మనస్తాపమే! పరిధి దాటి పోస్ట్‌లు చేయకండి. అవసరం ఉన్న చోట ప్రతిస్పందించండి. అంతేకానీ, తగుదునమ్మా అనుకుంటూ ప్రతి దానికీ స్పందిస్తూ కాలం వృథా చేసుకోవద్దు.
సామాజిక మాధ్యమాల్లో ఈ రాశివారు ఐకాన్స్టార్లుగా నిలిచే అవకాశం ఉంది. సమయోచితంగా పోస్ట్‌లు చేస్తూ అందరి మెప్పూ పొందుతారు. వివాదాల జోలికి వెళ్లరు. మీ ప్రత్యేకతను నిరూపించుకుంటారు. మీ పోస్టులు కొన్నిటికి ఊహించని వ్యక్తుల నుంచి స్పందన రావచ్చు. సంఘంలో గౌరవనీయ స్థానాల్లో ఉన్న వ్యక్తులు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
నోరు మంచిదైతే.. సోషల్ మీడియా కూడా మంచిదే! కానీ, ఎవరి మీది కోపమో సామాజిక మాధ్యమాల్లో తీర్చుకునే ప్రయత్నం చేస్తారు. మీరు ఉద్దేశించిన వ్యక్తులు కాకుండా, మిగతా వారి నుంచి విముఖత ఎదురవ్వొచ్చు. రుణయాప్‌ల చిక్కుల్లో పడొద్దు. ఫేస్బుక్, ట్విటర్, ఇన్‌స్టా ప్రైవసీ సెట్టింగ్స్ పకడ్బందీగా ఉండేలా చూసుకోండి.
ఏడాది ప్రథమార్ధంలో కొన్ని చికాకులు ఉంటాయి. ద్వితీయార్థంలో మళ్లీ పుంజుకుంటారు. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యే వాటికన్నా.. వైరం పెంచేవే ఎక్కువగా పోస్ట్ చేస్తుంటారు. వివాదాస్పద పోస్ట్‌లకు దూరంగా ఉండండి. మీ స్నేహితులకు వస్తున్న ఆదరణ చూసి అసహనానికి గురవుతారు. ఆగస్టు తర్వాత ఫాలోవర్స్ సంఖ్య క్రమేణా పెరుగుతుంది.
ఈ ఏడాది సామాజిక మాధ్యమాల్లో మీ ప్రస్థానం ‘కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం’గా సాగుతుంది. కొన్ని పోస్ట్‌లు వివాదాస్పదమై, చట్టపరమైన చర్యలకు దారితీయవచ్చు. ఆచితూచి కామెంట్ చేయండి. మీ స్థాయికి తగ్గట్టుగా వ్యవహరించండి. వాట్సాప్ గ్రూప్‌లలో మీ మెసేజ్‌లకు వక్ర భాష్యం చెప్పి మిమ్మల్ని ఇరుకున పెట్టే వ్యక్తులు ఉన్నారు జాగ్రత్త. ఫేస్బుక్లో మీ పోస్ట్‌లను పబ్లిక్కు కాకుండా ఫ్రెండ్స్ వరకే పరిమితం చేయడం మంచిది.
అపరిచిత వ్యక్తుల ఫ్రెండ్ రిక్వెస్ట్ ఆమోదించడానికి ముందు వాళ్లు ఎవరో పరిశీలించండి. స్పామ్ కాల్స్‌కు స్పందించకపోవడం మంచిది. డేటింగ్ యాప్‌ల జోలికి వెళ్లకండి. పర్యాటక బృందాల్లో చేరడం వల్ల కొత్త విషయాలు తెలుసుకుంటారు. పోస్టుల్లో వైవిధ్యం ఉండాలని చేసే ప్రయోగాల వల్ల కొందరికి దూరమయ్యే ప్రమాదం ఉంది. వివాదాస్పద విషయాల్లో మౌనం మేలు.
ఈ ఏడాది మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. మీరు చేసే పోస్ట్‌లకు లెక్కకు మించి లైక్‌లు, షేర్లు వస్తాయి. కానీ, ఇతరుల పోస్ట్‌లకు మీ స్పందన మాత్రం వివాదాస్పదం అవుతుంది. ఏ విషయాన్ని ఎవరితో పంచుకోవాలో వారికే పరిమితం చేయండి. శాస్త్ర, సాంకేతిక విషయాల గురించి ఎక్కువగా పోస్ట్‌లు చేస్తుంటారు. రాజకీయ వ్యవహారాలపై వాగ్బాణాలు సంధిస్తుంటారు.
సామాజిక మాధ్యమాల్లో హుందాగా వ్యవహరిస్తారు. మీ వాల్‌పై ఎప్పుడు ఎలాంటి పోస్ట్ వస్తుందా అని ఎదురుచూసే వ్యక్తులూ ఉంటారు. ఆధ్యాత్మిక, సంప్రదాయ విషయాలపై ఆసక్తి కనబరుస్తారు. అంతర్జాతీయ సమస్యలపైనా ఆలోచింపజేసే పోస్ట్‌లు చేస్తారు. వివాదాలు లేకుండా గడుపుతారు. ప్రైవసీ సెట్టింగ్‌లు, పాస్వర్డ్ విషయంలో ఏమరుపాటు తగదు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఈ కొత్త ఏడాదిలో మహిళలు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి
debut Heroines 2021 | తెలుగు ఇండస్ట్రీపై మెరిసిన కొత్త తారలు వీళ్లే..
Price Shock |2022లో సామాన్యుడికి షాక్.. వంట నూనె మొదలు కార్ల వరకూ అన్నింటి ధరలమోతే?!
Omicron on Gold | కొత్త సంవత్సరం షాకివ్వబోతున్న బంగారం ధరలు.. కారణమిదేనా !
GST Hike | జీఎస్టీ వాత మోత.. ఇవి కొంటే కండ్లు బైర్లు కమ్మాల్సిందే.. న్యూఇయర్‌లో పెరిగేవి ఇవే !
2021లో మహిళల కోసం జిందగీ అందించిన ప్రత్యేక కథనాలు మీకోసం..
social media horoscope for New year 2022 social media horoscope for New year 2022