GST Hike | జీఎస్టీ వాత మోత.. ఇవి కొంటే కండ్లు బైర్లు కమ్మాల్సిందే.. న్యూఇయర్‌లో పెరిగేవి ఇవే !
GST Hike | బట్టలు.. పాదరక్షలు కొనాలన్నా.. ఆన్లైన్లో క్యాబ్ సర్వీస్‌లు బుక్, ఫుడ్ ఆర్డర్ చేసినా అదనంగా జీఎస్టీ చెల్లించాల్సిందే.

GST Hike | అంతా నూతన వసంతానికి స్వాగతం పలికేందుకు సన్నద్ధం అవుతున్నారు. రకరకాల ప్లాన్లతో.. కొత్త వస్తువుల కొనుగోళ్లకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కానీ 2022 జనవరి ఒకటో తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలక మార్పులు అమల్లోకి తెస్తున్నది. దీంతో సగటు ఇండియన్ పర్స్‌కు చిల్లుబడటం ఖాయంగా కనిపిస్తున్నది. దుస్తుల నుంచి సేవల వరకు జీఎస్టీ పెంచేసి.. ప్రజల ముక్కు పిండి వసూలు చేసేందుకు రంగం సిద్ధమైంది. శనివారం నుంచి కొత్తగా అమల్లోకి రానున్న కొన్ని మార్పుల వల్ల సగటు భారతీయుడి నుంచి వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కోనున్నారు. ఇక నుంచి దుస్తులు.. బూట్ల ధరలు పెరగనున్నాయి. క్యాబ్‌లు బుక్ చేసుకున్నా.. ఫుడ్ ఆర్డర్ చేసినా అదనంగా జీఎస్టీ వడ్డన ఖాయమే.
దుస్తులు.. ఫుట్‌వేర్ కొనాలంటే..
జనవరి ఒకటో తేదీ నుంచి దుస్తులు, ఫుట్‌వేర్‌పై కేంద్రం జీఎస్టీ 12 శాతం వసూలు చేయనున్నది. ఇప్పటి వరకు రెడీమేడ్, చేనేత దుస్తులు, ఫుట్‌వేర్‌పై ఐదు శాతం ఉన్న జీఎస్టీపై ఏడు శాతం అదనంగా పెంచేసింది. దీనికి అనుగుణంగా రెడీమేడ్ గార్మెంట్ల ధరలు పెరుగనున్నాయి. నూతన సంవత్సరంలో రెడీమేడ్ గార్మెంట్స్ కొనుగోలు చేయాలంటే అధిక మొత్తం చెల్లించేందుకు సిద్ధం కావాల్సిందే.
క్యాబ్ అంటే మోతే
ఆన్లైన్లో ఆటో రిక్షా లేదా క్యాబ్ బుకింగ్ ఎక్స్పెన్సివ్. క్యాబ్స్ అగ్రిగేటర్ సేవలపై ఐదు శాతం జీఎస్టీ విధించనున్నారు. ఓలా, ఉబెర్ వంటి యాప్ ఆధారిత క్యాబ్ అగ్రిగేటర్స్ కింద కారు లేదా ఆటో రిక్షా బుక్ చేసుకుంటే 5 శాతం జీఎస్టీ చెల్లించాల్సిందే. ఆఫ్‌లైన్‌లో ఆటో రిక్షా బుకింగ్స్‌లో ఎటువంటి అదనపు చార్జీలు ఉండవు.
ఇక ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ చేయలేం
ఇక నూతన సంవత్సరంలో ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ చేసుకున్నా ఖర్చు తడిసిమోపెడవుద్ది. జొమాటో, స్విగ్గీ వంటి ఫుడ్ డెలివరీ యాప్స్ నుంచి ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఐదు శాతం జీఎస్టీ వడ్డిస్తారు. ఫుడ్ ఆర్డర్ చేసే కస్టమర్లపై ఈ పన్ను విధించడం లేదని కేంద్రం స్పష్టం చేసింది. కానీ ఆచరణలో ఏ కంపెనీపై ప్రభుత్వం పన్ను విధించినా.. దాన్ని తమ కస్టమర్లు, ఇతర మార్గాల నుంచి వసూలు చేస్తాయి ఆ కంపెనీలు. కనుక నూతన సంవత్సరం నుంచి ఆన్లైన్ ఫుడ్ ఆర్డరింగ్ కాస్ట్లీ కానున్నది. అలాగే పన్ను ఎగవేతను నిరోధించడానికి కేంద్రం పలు చర్యలు తీసుకున్నది. జీఎస్టీ రీఫండ్స్ పొందడానికి ఆధార్ అథంటికేషన్ తప్పనిసరి చేసింది. ఇంకా ఇన్పుట్ వ్యయం పెరిగిందంటూ కార్లు, ఎలక్ట్రానిక్ గూడ్స్, గృహోపకరణాలు, ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ ధరలు కూడా పెరుగబోతున్నాయి.
ఇవి కూడా చదవండి:
Price Shock | సామాన్యుడికి షాక్.. వంట నూనె మొదలు కార్ల వరకూ అన్నింటి ధరలమోతే?!
IIT Placements | కరోనాతో ఫ్రెషర్లకు కలిసొచ్చిన అదృష్టం.. కోట్లలో జీతాలు!
Used Cars Market | టాప్‌గేర్‌లో యూజ్డ్ కార్ల సేల్స్.. పర్సనల్ మొబిలిటీకి ప్రియారిటీ!
ITR filing | ఆ ఆదాయాన్ని ఐటీఆర్‌లో 3 నెలలకోసారి ఎందుకివ్వాలి?!
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Business news
- gst rise
RELATED ARTICLES
తాజా వార్తలు
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
Assam Girl | అసోం యువతి మృతి కేసులో ట్విస్ట్.. రైల్వే ట్రాక్ పక్కనే మరో డెడ్‌బాడీ..!
Nepal Falsh Floods | నేపాల్‌లో మళ్లీ అకస్మిక వరద.. నేలమట్టమైన ఇళ్లు, బ్రిడ్జిలు..!
Digital arrest | డిజిటల్ అరెస్ట్ వలలో చిక్కి యువతి విలవిల.. రూ.2.5 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య..!
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

