Price Shock | సామాన్యుడికి షాక్.. వంట నూనె మొదలు కార్ల వరకూ అన్నింటి ధరలమోతే?!
Price Shock | ఇన్పుట్ కాస్ట్, రవాణా చార్జీల పేరిట కార్ల నుంచి కన్జూమర్ గూడ్స్ వరకూ అన్నింటి ధర మోత మోగనుంది.

Price Shock | దేశ ప్రజలంతా కొత్త సంవత్సర వేడుకలు జరుపుకున్నారు… సంబురాలు జరుపుకున్నారు.. కానీ ఫ్రిజ్‌లు.. వాషింగ్ మిషన్లు.. ఎయిర్ కండీషనర్లు.. బిస్కట్లు.. వంటనూనెలు.. కార్లు.. మోటార్ బైక్స్ ఒక్కటేమిటి.. ఏ వస్తువు కొనాలన్నా షాక్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. సగటు భారతీయుడు జేబుకు చిల్లు పడటం కూడా అనివార్యమే..
మనం ప్రతి రోజూ వాడే నిత్యావసర వస్తువులతోపాటు గృహోపకరణాలు.. అన్ని రకాల వస్తువుల ధరలను వచ్చే కొన్ని నెలల్లో పెంచడానికి ఆయా సంస్థల యాజమాన్యాలు ప్రణాళికలు సిద్ధం చేశాయని సమాచారం. 2021లో ఇప్పటి వరకు రెండు మూడు సార్లు వీటి ధరలు పెరిగాయి. ఇన్పుట్ వ్యయం… రవాణా భారం.. సప్లయ్ చైన్ సమస్యలతో ఆయా కార్పొరేట్ సంస్థల లాభాలకు గండి పడింది. దీంతో తమ లాభాలను కాపాడుకునేందుకు.. ధరలు పెంచడానికి సంసిద్ధం అయ్యాయి.
ఎఫ్ఎంసీజీ కంపెనీలు వచ్చే మూడు నెలల్లో 4-10 శాతం ధరలు పెంచడానికి ప్రణాళికలు వేసుకున్నాయి. దీంతో ఆయా వస్తువుల ధరలు భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే సేల్స్ పడిపోయే చాన్స్ కూడా ఉంది. డాబర్ సంస్థ ఇప్పటికే 4 శాతం పెంచేసింది. మరో దఫా వడ్డన తప్పదని సంకేతాలిచ్చింది. ద్రవ్యోల్బణం పెరిగిపోవడంతో ధరలు పెంచక తప్పడం లేదని డాబర్ సీఈవో మోహిత్ మల్హోత్రా చెప్పారు. ఇక హిందూస్థాన్ యూనీలివర్, బ్రిటానియా, మారికో తదితర ంసస్థలు కూడా గత రెండు త్రైమాసికాల్లో 5-12 శాతం ధరలు పెంచేశాయి. గతేడాదితోపోలిస్తే క్రూడ్, పామాయిల్, ప్యాకేజింగ్ కాస్ట్ రెండు రెట్లకు పైగా పెరిగిపోయాయని చెబుతున్నాయి.
ఫ్రిజ్‌లు, వాషింగ్ మిషన్లు, ఏసీలు తదితర కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థలు ఇప్పటికే 3-5 శాతం ధరలు పెంచేశాయి. వచ్చే నెలలో మరో రౌండ్ 6-10 శాతం ధరల పెంపునకు ముహూర్తం ఖరారు చేశాయని వినికిడి. 2020 డిసెంబర్ నుంచి ఈ కంపెనీలు ధరలు పెంచడం ఇది నాలుగో సారి కానున్నది.
స్టీల్, బొగ్గు ఇతర ముడి సరుకు ధరలు పెరిగిపోవడంతో దేశీయ ఆటోమొబైల్ సంస్థలు కార్లు, బైక్స్, స్కూటర్ల ధరలు పెంచడానికి సిద్ధం అవుతున్నాయని ఆయా సంస్థల టాప్ ఎగ్జిక్యూటివ్స్ కథనం. స్టీల్‌తోపాటు రాగి, అల్యూమినియం, ప్లాస్టిక్ తదితర కమొడిటీస్ ధరలు 22-23 శాతం పెరిగాయని కన్జూమర్ డ్యూరబుల్ సంస్థల ఎగ్జిక్యూటివ్స్ చెబుతున్నారు.
ధరల పెంపు అనివార్యం అని ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఏసీ బిజినెస్, హోం అప్లియెన్స్ వైస్ ప్రెసిడెంట్ దీపక్ బన్సాల్ చెప్పారు. కమొడిటీ కాస్ట్, రవాణా, మారకం రేట్లు పెరిగిపోవడమే దీనికి కారణం అన్నారు. ఇన్పుట్ కాస్ట్ తగ్గించడానికి అన్ని ప్రయత్నాలు చేసినా ఖర్చు తగ్గించుకోవడానికి రెండు దఫాలు ధరలు పెంచామన్నారు. కానీ తమ లాభాలేమీ పెరుగలేదని ఆందోళన వ్యక్తం చేశారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

