Winter Superfoods | చలికాలంలో జలుబు, దగ్గు, జ్వరం వంటి వైరల్ ఇన్ఫెక్షన్లు ప్రబలుతుంటాయి. అయితే ఆరోగ్యకరమైన ఆహారంతో వీటి బారిన పడకుండా ఇమ్యూనిటీని పెంచుకోవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. వింటర్ సూపర్ ఫుడ్స్‌తో శరీరాన్ని వేడిగా ఉంచుకోవడంతో పాటు ఆరోగ్యాన్నీ పరిరక్షించుకోవచ్చు.
ఎర్ర ముల్లంగిగా పిలిచే టర్నిప్స్ ఈ కాలంలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వింటర గేమ్ ఛేంజర్‌గా ఎర్ర ముల్లింగిని చెబుతుంటారు. ఈ దుంపలు విటమిన్ సీ, విటమిన్ కేతో మన రోగ నిరోధక వ్యవస్ధను బలోపేతం చేయడంతో పాటు ఐరన్ లోపాన్ని అధిగమించేందుకు చక్కగా పనిచేస్తాయి. ఇక స్వీట్ పొటాటో, బాదం వింటర్లో ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
బాదంలో మెదడు పనితీరును మెరుగుపరిచే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇంకా ఒమెగా 3 పవర్‌హౌస్‌గా పేరొందిన ఫ్లాక్స్ సీడ్స్, వాల్నట్స్, చియా సీడ్స్ వంటి గింజల్లో విటమిన్ ఈ, జింక్ వంటి సూక్ష్మ పోషకాలు అధికంగా ఉంటాయి. ఇక మాంసాహారులు ఈ సీజన్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లతో పాటు క్యాల్షియం, ఫాస్పరస్, విటమిన్లు, మినరల్స్, జింక్ లభించే ఫిష్‌ను తీసుకోవచ్చు.
Read More :