Revathi Advaithi | అమ్మ మాట బంగారు బాట అంటున్న ఫ్లెక్స్ సీఈవో రేవతి అద్వైతి
ఫ్లెక్స్... వివిధ బ్రాండ్స్ పేరుతో మార్కెట్ను ఏలేస్తున్న అనేక వస్తువులను ఉత్పత్తి చేసే కాంట్రాక్ట్ మాన్యుఫ్యాక్చరింగ్ సంస్థ. ఈ రంగంలో అదే నెంబర్ వన్. ఇలాంటి ఓ కంపెనీకి భారతీయురాలు సీఈఓ కావడం విశేషం.
Revathi Advaithi | ఫ్లెక్స్… వివిధ బ్రాండ్స్ పేరుతో మార్కెట్ను ఏలేస్తున్న అనేక వస్తువులను ఉత్పత్తి చేసే కాంట్రాక్ట్ మాన్యుఫ్యాక్చరింగ్ సంస్థ. ఈ రంగంలో అదే నెంబర్ వన్. ఇలాంటి ఓ కంపెనీకి భారతీయురాలు సీఈఓ కావడం విశేషం. ఆమె పేరు రేవతి అద్వైతి. తమిళనాడులోని ఓ మారుమూల పల్లెలో పుట్టి పెరిగారు. రేవతి ఫ్లెక్స్ పగ్గాలు చేపట్టిన సందర్భం అంత తేలికైంది కాదు. ముందు కొవిడ్ విరుచుకుపడింది. తర్వాత గ్రేట్ రెజిగ్నేషన్ పలకరించింది. ఆపై ఆర్థిక మాంద్యం దెబ్బతీసింది.
ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు అస్థిరంగా ఉన్నాయి. ఎటుచూసినా యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇన్ని ప్రతికూల నేపథ్యాల మధ్య సంస్థ వృద్ధిలో 17 శాతం ఎదుగుదల నమోదు అయ్యేలా చూశారు. 30 దేశాల్లో విస్తరించిన కంపెనీని మరింత అభివృద్ధి చేశారు. తన విజయం వెనుక మేనేజ్మెంట్ పట్టాలతోపాటు తల్లి నుంచి నేర్చుకున్న విలువలు ఉన్నాయని అంటారు. రేవతి తల్లి నిరక్షరాస్యురాలు. చిన్న వయసులోనే భర్తను కోల్పోయారు. అయినా కుంగిపోకుండా అయిదుగురు కూతుళ్లను పెంచారు. ఆ పట్టుదలే రేవతికి అబ్బింది. కేవలం ఫ్లెక్స్ సీఈఓగానే కాదు… తన అపార నైపుణ్యంతో మరెన్నో గౌరవప్రదమైన హోదాల్లో కొనసాగుతున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సభ్యురాలిగా, ఎమ్ఐటీ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థల సలహాదారుగా.. తనదైన ముద్ర వేస్తున్నారు.
Read Today's Latest Success-story News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

