న్యూఢిల్లీ : వర్షాకాలంలో వేడివేడిగా మొక్కజొన్నను (Healthy Snack) ఎంజాయ్ చేయడం ఎవరికి మాత్రం ఇష్టముండదో చెప్పండి..రెయినీ సీజన్లో అన్ని వయసుల వారు అమితంగా ఇష్టపడే పాపులర్ స్ట్రీట్‌ఫుడ్ మొక్కజొన్న అనే అందరూ చెప్పేస్తారు. కార్న్‌ను ఉడకబెట్టి లేదా మంటపై వేడి చేసి తినడం ఈ సీజన్లో అన్ని చోట్లా చూస్తుంటాం.
వర్షాకాలంలో ఎంతో టేస్టీగా ఉండటమే కాదు మొక్కజొన్నలో అత్యవసర పోషకాలు మెండుగా ఉన్నాయన్నది నిపుణుల మాట. వర్షాకాలంలోనే పండించే మొక్కజొన్న స్ధానికంగా లభ్యమవడం ఈ సీజన్లో శరీరాన్ని వేడిగా ఉంచడంలో కూడా తోడ్పడుతుంది.
మొక్కజొన్నను ప్రిపేర్ చేయడం కూడా ఎంతో ఈజీ. ఈ టేస్టీ డిష్‌లో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సీ, మెగ్నీషియం వంటి అత్యవసర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. తక్కువ కొవ్వు ఉండటంతో పాటు కడుపు నిండిన భావన కలిగించే కార్న్ అన్నింటికంటే మెరుగైన స్నాక్‌గా ఈ సీజన్లో ఎంపిక చేసుకోవచ్చు.
Read More :
LPG Cylinder price | స్వల్పంగా తగ్గిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర..