Cold | కొన్నిసార్లు దగ్గు, జలుబు, సైనస్ కారణంగా ముక్కు మూసుకుపోతుంది. ఓపట్టాన ఊపిరి ఆడదు. ఇలాంటి సమస్య ఎదురైనప్పుడు ఇంట్లోనే పరిష్కారాలు అన్వేషించవచ్చు.
› ఆవాల నూనెను వాసన చూడండి. ముక్కు పట్టేసినట్టు ఉన్నచోట ఆవాల నూనెతో మర్దనా చేస్తే.. ఆ ఘాటుకు ముక్కులోని శ్లేష్మం బయటికి వస్తుంది.
› జీలకర్రను వేయించి, బాగా వేడిగా ఉన్నప్పుడే ఓ గుడ్డలో కట్టాలి. ఆ ఆవిరిని ముక్కుతో పీల్చుకుంటే శ్లేష్మం కరిగిపోతుంది.
› యూకలిప్టస్ పూలను వేడినీటిలో వేసి, ఆవిరి పడితే త్వరగా ఉపశమనం లభిస్తుంది. యూకలిప్టస్ నూనె కూడా బాగానే పనిచేస్తుంది.
› ముక్కు రంధ్రాలు మూసుకుపోయినప్పుడు ఉల్లిపాయను దంచి వాసన చూడండి. ఆ ఘాటుకు కూడా శ్లేష్మం వదిలిపోతుందంటారు గృహ వైద్యులు.
జలుబుతో మీ చిన్నారులు సతమతమవుతున్నారా? ఇలా చేస్తే సత్వర ఉపశమనం!!”
“బిడ్డకు సర్ది అయ్యిందా.. ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే!”
“అరటి పండుతో ఆరోగ్యమే కాదు.. అందం కూడా పెరుగుతుందా?”