శ్వాస వ్యవస్థకు ఎదురయ్యే సమస్యల్లో జలుబు ఒకటి. ఇది ముక్కును ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. కొందరిలో గొంతు, సైనస్ భాగాలకూ వ్యాపిస్తుంది. ఎక్కువగా రైనో వైరస్ వల్ల, కొంతవరకు అడినో, కరోనా వైరస్ల వల్ల వస్తుంది. పిల్లల్లో ఏడాదికి ఆరు నుంచి ఎనిమిదిసార్లు కనిపిస్తుంది. 10-15 శాతం పిల్లలకు మాత్రం పదీపన్నెండుసార్లు కూడా రావచ్చు. చాలా సందర్భాల్లో తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగాలు చేస్తూ.. బిడ్డల్ని సంరక్షణ కేంద్రాల్లో వదిలేస్తుంటారు. అలాంటి పిల్లల్లో జలుబు సమస్య తీవ్రంగా ఉంటుంది. దీర్ఘకాలికంగా ఇబ్బందిపెడుతుంది. అయితే, కొన్ని చిట్కాలు పాటిస్తే పిల్లలకు జలుబునుంచి ఉపశమనం లభిస్తుందట. మరి అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం.