Weight Loss Tips: జిమ్‌కు వెళ్లకుండా 21 రోజుల్లో 5 కిలోలు తగ్గాలా? డైటీషియన్ రిచాను ఫాలో అయిపోండి!!
అధిక బరువు.. ప్రస్తుత కాలంలో చాలామందిని వేధిస్తున్న సమస్య. బిజీ షెడ్యూల్ కారణంగా చాలామంది వర్కౌట్స్ చేయలేరు. తమకు కనిపించిన డైట్‌ను ఫాలో అయిపోతుంటారు. ఇది బరువు పెరగడానికి, ఊబకాయానికి దారితీస్తుంది. అయితే ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండేందుకు రోజువారీ దినచర్యలో శారీరక శ్రమను చేర్చుకోవడం చాలా ముఖ్యం. సమయం దొరకనివాళ్లు, సమయం దొరికినా వ్యాయామం చేసేందుకు బద్ధకించేవాళ్లు బరువును ఈజీగా తగ్గించుకునేందుకు డైటీషియన్ రిచా ఓ చక్కటి సూచన అందించారు.
అధిక బరువు.. ప్రస్తుత కాలంలో చాలామందిని వేధిస్తున్న సమస్య. బిజీ షెడ్యూల్ కారణంగా చాలామంది వర్కౌట్స్ చేయలేరు. తమకు కనిపించిన డైట్‌ను ఫాలో అయిపోతుంటారు. ఇది బరువు పెరగడానికి, ఊబకాయానికి దారితీస్తుంది. అయితే ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండేందుకు రోజువారీ దినచర్యలో శారీరక శ్రమను చేర్చుకోవడం చాలా ముఖ్యం. సమయం దొరకనివాళ్లు, సమయం దొరికినా వ్యాయామం చేసేందుకు బద్ధకించేవాళ్లు బరువును ఈజీగా తగ్గించుకునేందుకు డైటీషియన్ రిచా ఓ చక్కటి సూచన అందించారు.
రిచా తన ఇన్స్టాగ్రాం అకౌంట్లో ఒక నెలలో 5 కిలోల వరకు ఎలా బరువు తగ్గవచ్చనే దానిపై చిట్కాలను పంచుకున్నారు. వాకింగ్‌కు తక్కువ శ్రమ, పరికరాలు అవసరం లేదని, అనుకున్న బరువును చేరుకోవడంలో ఇది మీకు సహాయం చేస్తుందని రిచా వెల్లడించారు. “బరువు తగ్గేందుకు మనం మంచి ఆహారాన్ని తీసుకోవాలి. శారీరకంగా చురుగ్గా, ఆరోగ్యంగా ఉండాలి. ఎక్కువ సమయం, పరికరాలు లేదా వ్యాయామశాల అవసరం లేని వ్యాయామం ఇది. అధిక మొత్తంలో కేలరీలను బర్న్ చేసి, వేగంగా బరువు తగ్గేందుకు ఇది ఉపయోగపడుతుంది. అని రిచా క్యాప్షన్ ఇచ్చారు.
నడకను రోజువారీ దినచర్యలో భాగం చేసుకోవాలని పోషకాహార నిపుణురాలు రిచా చెప్పారు. ఆమె ప్రకారం, రెగ్యులర్ వాకింగ్ అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. నడక వల్ల వేగంగా బరువు తగ్గడంతోపాటు ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి. ఇది ఒక వ్యక్తి చేయగలిగే సులభమైన, అత్యంత తక్కువ ఖర్చుతో కూడుకున్న వ్యాయామాలలో ఒకటి. చాలా మంది క్రమం తప్పకుండా నడవవచ్చు. మరింత చురుగ్గా ఉండడం వల్ల ప్రయోజనాలను పొందవచ్చు. నడక వల్ల బెల్లీ ఫ్యాట్ తగ్గిపోతుంది. వాకింగ్లాంటి ఏరోబిక్ వ్యాయామం క్రమం తప్పకుండా చేస్తే ఊహించని ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. ఒక మైలు (1.6 కి.మీ) నడవడం వల్ల దాదాపు వంద కేలరీలు ఖర్చవుతాయి. మీరు ప్రతిరోజూ ఎన్ని అడుగులు నడవాలి? మెరుగైన ఆరోగ్యం, వేగంగా బరువు తగ్గడంకోసం రోజూ పదివేల అడుగులు వేయాలని రిచా సూచిస్తున్నారు.
రోజూ వాకింగ్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు
-
- ఇది ఉచితం (పరికరాలు అవసరం లేదు)
- ఇది కేలరీలను బర్న్ చేస్తుంది. బరువు తగ్గేందుకు దోహదపడుతుంది
- ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది
- మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. సంతోషాన్ని కలిగిస్తుంది.
- గాయాలను త్వరగా మాన్పుతుంది.
- ఆకలి, కోరికలను తగ్గిస్తుంది
- మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది
- హార్ట్ స్ట్రోక్స్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది
- జీవక్రియను పెంచుతుంది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

