మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Health - Jul 26, 2020 , 22:52:20

శానిటైజర్‌ ఎక్కువగా వాడితే ప్రమాదమే!

శానిటైజర్‌ ఎక్కువగా వాడితే ప్రమాదమే!

న్యూ ఢిల్లీ: కొవిడ్‌ నేపథ్యంలో ఇప్పుడు శానిటైజర్‌ తప్పనిసరైంది. ఇవి వాడితే బ్యాక్టీరియాలు, వైరస్‌లు, ఇతర సూక్ష్మజీవులు చనిపోతాయని తెలుసు. కరోనానుంచి తప్పించుకునేందుకు ఇప్పుడందరూ విరివిగా వినియోగిస్తున్నారు.  అయితే, వీటిని అతిగా వాడితే తీవ్ర చర్మ సమస్యలు వస్తాయట. 

చర్మం పొడిబారడం, ఎర్రబడడం, మంటలాంటి స్కిన్‌ ప్రాబ్లమ్స్‌ వస్తాయి. ఈ సమస్య నుంచి బయలపడాలంటే డెర్మటాలజిస్ట్స్ అండ్‌ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్‌ సర్జన్‌ డాక్టర్ బీఎల్‌ జంగిద్ కొన్నిసూచనలు చేశారు.   

1. పరిమిత వినియోగం ఎల్లప్పుడూ ఉత్తమమైదే. అది శానిటైజర్లకు కూడా వర్తిస్తుంది. కొద్ది మోతాదులో దీన్ని వాటితే ప్రభావవంతంగా పనిచేస్తుంది. సూక్ష్మక్రిములను చంపేస్తుంది. 

2.శానిటైజర్లలో ఉండే రసాయనాలు మన చర్మాన్ని దెబ్బతీస్తాయి. అందుకే శానిటైజర్‌ రాసిన తర్వాత వెంటనే మంచి మాయిశ్చరైజర్‌ తప్పనిసరిగా రాయాలి. అలాగే, హీలింగ్‌ ఆయింట్‌మెంట్‌ పూసుకోవాలి.

3. చర్మంపై పగులు గనుక కనిపిస్తే అవి తగ్గే వరకూ ప్రతిరాత్రి చేతులకు గ్లౌసులు వేసుకొని పడుకోవాలి.

4.అత్యవసరమైతే తప్ప శానిటైజర్లను వాడకండి. దీనికి బదులు సబ్బు, నీళ్లతో చేతులను శుభ్రపర్చుకోండి. బ్యాక్టీరియాలు, వైరస్‌లనుంచి తప్పించుకునేందుకు ఇదే ఉత్తమమైన మార్గం.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo