Health Tips | ఇలా చేస్తే అధిక బరువుకు చెక్..!
బరువు (Health Tips) తగ్గాలని మన చుట్టూ ఎందరో ప్రయత్నిస్తూ కనిపిస్తుంటారు. వ్యాయామాల దగ్గర నుంచి కఠిన డైట్ నియమాలు పాటించినా చాలా మంది బరువు తగ్గడంలో విఫలమవుతుంటారు.
న్యూఢిల్లీ : బరువు (Health Tips) తగ్గాలని మన చుట్టూ ఎందరో ప్రయత్నిస్తూ కనిపిస్తుంటారు. వ్యాయామాల దగ్గర నుంచి కఠిన డైట్ నియమాలు పాటించినా చాలా మంది బరువు తగ్గడంలో విఫలమవుతుంటారు. అదనపు కొవ్వును కరిగించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఆహార నియమాల్లో కొందరు కఠినంగా వ్యవహరించడంతో అది వారి ఆరోగ్యంపైనా ప్రభావం చూపుతుంది. ఎలాంటి అలసట, అనారోగ్యాలకు గురికాకుండా బరువు తగ్గే మార్గాలు ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు.
బరువు తగ్గడంతో పాటు శరీరాకృతి సజావుగా ఉండేలా చూసుకోవడం కీలకమని చెబుతున్నారు. బరువు తగ్గే క్రమంలో సమీకృత ఆహారం అవసరం. తృణ ధాన్యాలు, పండ్లు, కూరగాయలు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఆహారంలో భాగంగా తీసుకుంటే అది శక్తిని ఇవ్వడంతో పాటు దీర్ఘకాలంలో ఆరోగ్యం మెరుగుపరుస్తుంది. ఇక పోషకాలు తీసుకునే ప్రక్రియలో వాటిని తగు మోతాదులో పరిమితంగా ఉండేలా చూసుకోవాలి. అదనపు కిలోలు తగ్గేలా తక్కువ మోతాదులోనే ఆహారం తీసుకోవాలి.
రోజువారీ తీసుకునే ఆహారంలో ప్రొటీన్లు అధికంగా ఉండేలా చూసుకోవాలి. ప్రొటీన్లు తక్షణ శక్తిని ఇవ్వడమే కాకుండా కడుపు నిండిన భావన కలిగించడంతో ఎక్కువ ఆహారం తీసుకోకుండా ఉంటారు. షుగర్ పరిమితంగానే తీసుకుంటే బరువు పెరిగే అవకాశం ఉండదు. ఇక ముఖ్యమైన అంశం రోజూ తగినంత నీరు తీసుకోవాలి. నీరు అవసరమైనంత తాగితే శరీరం పనితీరు మెరుగవుతుంది. రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు (రెండు లీటర్లు) తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.
Read More
Yoga | నిత్య ఆరోగ్యానికి యోగాస్త్రం.. సాధనపై మక్కువ పెంచుకుంటున్న యువత, ఉద్యోగులు
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

