న్యూఢిల్లీ : మండు వేసవిలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతుంటే ఉక్కిరిబిక్కిరి అవుతుంటాం..అయితే సమ్మర్ హీట్‌ను కూల్‌గా బీట్ చేసేందుకు కొబ్బరి నీళ్లను మించిన సహజసిద్ధమైనవి (Health Tips) మరొకటి లేవని వైద్య నిపుణులు చెబుతున్నారు. వేసవిలో శరీరాన్ని హైడ్రేట్‌గా, ఆరోగ్యంగా ఉంచుకునేందుకు కొబ్బరి నీళ్లు మేలైనవి. కొబ్బరి నీళ్లు మన శరీరాన్ని సహజసిద్ధంగా చల్లగా ఉంచుతాయని ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ దిక్స భవ్సర్ సవలియ ఇన్స్టాగ్రాం పోస్ట్‌లో చెప్పుకొచ్చారు.
వేసవిలో కొబ్బరి నీళ్లతో పాటు లేత కొబ్బరి మెరుగైన ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయని రాసుకొచ్చారు. హైపర్ అసిడిటీ, కడుపుబ్బరం, యూరిన్ రిటెన్షన్, శరీరంలో బర్నింగ్ సెన్సేషన్, నీరసం, నిస్సత్తువ ఆవహించిన సమయంలో కొబ్బరి నీళ్లను ఔషధంగా ఎప్పటినుంచో వాడుతున్నారని ప్రస్తావించారు. కొబ్బరి నీళ్లతో జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది.
కొబ్బరి నీరు మూత్రాశయాన్ని శుభ్రం చేయడంతో పాటు అలసటను దూరం చేసి శరీరానికి శక్తిని, నిగారింపును అందిస్తుంది. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటలలోపు ఏ సమయంలోనైనా కోకోనట్ వాటర్‌ను తీసుకోవచ్చు.
Read More