Health Tips | రోజూ తినే ఆహారంలో ఇవి ఉంటే ఆరోగ్యం మీ వెంటే
Health Tips | మన ఆహార అలవాట్లపైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తినాలి. ఇదే ఉద్దేశ్యంతో రకరకాల డైట్లు ఫాలో అవుతారు.

Health Tips | మన ఆహార అలవాట్లపైనే మన ఆరోగ్యం ( Health ) ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తినాలి. ఇదే ఉద్దేశ్యంతో చాలామంది రకరకాల డైట్లు ఫాలో అవుతుంటారు. ఇందుకోసం ఎక్కువ ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతుంటారు. ఏవేవో తింటుంటారు. కానీ మన ఇంట్లో దొరికే ఆహార పదార్థాలతోనే ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. ఈ ఐదింటిని ప్రతి రోజూ మనం తినే ఆహారంలో చేర్చుకోవడం ద్వారా రోగాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండొచ్చు. మరి ఆ ఆహార పదార్థాలేంటో చూద్దామా..

పెరుగు
పెరుగు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ప్రతిరోజు పెరుగును ఆహారంగా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇందులో ప్రోటీన్లు, గట్ బ్యాక్టీరియా పుష్కలంగా లభిస్తుంది. కాల్షియంతో పాటు విటమిన్ బీ2, విటమిన్ బీ12, పొటాషియం, మెగ్నీషియం కూడా అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియ మెరుగుపడటంలో సహాయపడతాయి. అలాగే మానసిక ఒత్తిడిని తగ్గించడంతోపాటు దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాన్ని తగ్గిస్తాయి.

పప్పు దినుసులు
మనం తరచూ తినే పప్పుల్లో పుష్కలంగా లభిస్తాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఫైబర్, ప్రోటీస్లు కూడా అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేసేలా సహాయపడుతాయి. అలాగే కొత్త కణాలు పునరుత్పత్తి అవ్వడంలో సహకరిస్తాయి. పప్పు దినుసుల్లో విటమిన్ ఏ, విటమిన్ బీ, విటమిన్ సీ, విటమిన్ ఈ, మెగ్నిషియం, ఐరన్, జింక్ కూడా లభిస్తాయి.

మిల్లెట్లు
మన తాత ముత్తాతలు ఒకప్పుడు ఎక్కువగా రాగి, జొన్న, సజ్జ ఎక్కువగా తినేవాళ్లు. అందుకే వారు చాలాకాలం ఆరోగ్యంగా జీవించారు. ఈ మిల్లెట్లలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అలాగే జీర్ణక్రియకు అవసరమయ్యే మంచి బ్యాక్టీరియా ఏర్పడటంలో ఇవి ఎంతగానో దోహదపడతాయి. అంతేకాకుండా పేగు కేన్సర్ వచ్చే అవకాశాన్ని కూడా మిల్లెట్లు తగ్గిస్తాయి. బరువు తగ్గాలని అనుకునేవారికి ఇది మంచి ఆహారం.

మసాలా దినుసులు
మన వంట్లో మసాలా దినుసులు తప్పనిసరిగా వాడుతుంటాం. కూరల్లో వేసే పసుపు, లవంగాలు, మెంతులు, మిరియాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నొప్పి నివారణ, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు వీటిలో ఎక్కువగా ఉంటాయి. గాయాలను తగ్గించడంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఇవి ఉపయోగపడతాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చూడండి..
Health Tips : ఈ రోగాలుంటే డ్రై ఫ్రూట్స్ తినాల్సిందే !
గొంతునొప్పి తగ్గాలా..అయితే వీటిని తీసుకోండి..!
గ్రీన్ టీని అధికంగా తాగుతున్నారా..? అయితే జాగ్రత్త..!
వేసవిలో మామిడిపండ్లు తినొచ్చా ?
కాఫీ తాగండి.. ఆరోగ్యంగా ఉండండి..
నిమ్మరసం, పసుపు కలుపుకుని తాగితే కలిగే లాభాలివే..!
COVID-19 : పది సెకన్లు శ్వాస బిగబట్టగలిగితే కరోనా లేనట్లేనా?
COVID-19 doubts : ఆల్కహాల్ తీసుకుంటే కరోనా రాదా?
COVID Vaccine : వ్యాక్సిన్ ఎవరు తీసుకోవచ్చు? గుండెజబ్బులు, షుగర్ ఉంటే టీకా తీసుకోవచ్చా?
Coronavirus Recovery : కరోనా తగ్గినా వ్యాయామం చేయాల్సిందే
coronavirus instructions : కరోనా నుంచి కోలుకున్నారా? ఈ జాగ్రత్తలు పాటించండి
Coronavirus Recovery: కరోనా తగ్గినా నీరసంగా ఉంటుందా? ఈ జాగ్రత్తలు అవసరమే
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

