ఈ రోగాలుంటే డ్రై ఫ్రూట్స్ తినాల్సిందే !

అబ్బో రేటు ఎక్కువ. మనలాంటి వాళ్లం ఏం కొనగలం అని డ్రైఫ్రూట్స్ కి దూరంగా ఉంటారు. అయితే అనవరస ఖర్చులను తగ్గించుకొని ఆరోగ్యం కోసం డ్రైఫ్రూట్స్ లాంటివి కొనడం మంచిదంటున్నారు ఆరోగ్యనిపుణులు. ప్రతీరోజూ తప్పకుండా మనం ఈ డ్రై ఫ్రూట్స్ ని తీసుకోవాలని చెబుతున్నారు.
ఎందుకంటే వీటిల్లో ఫైబర్, యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అందువల్ల డయాబెటిస్, ఒబెసిటీ లాంటి అనారోగ్యాలు కంట్రోల్లో ఉంటాయి. కాన్సర్ లాంటి భయంకర రోగాల్ని అడ్డుకోవడంలో డ్రై ఫ్రూట్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. అంతేకాదు గుండె జబ్బులు రాకండా, బ్రెయిన్ బాగా పనిచేసేలా ఇవి చేస్తున్నాయి. మలబద్ధకం సమస్యకు ఇవి చెక్ పెడతాయి. ఆహారాన్ని బాగా జీర్ణం అయ్యేలా చేస్తుంది.
రోజూ 3 ఖర్జూరాలు తింటే చాలామంచిది. చాలావరకు అనారోగ్యాలు తగ్గుతాయి. ముఖ్యంగా రక్తహీనత ఉన్నవాళ్లు ఖర్జూరం తింటే వంటికి రక్తం పడుతుంది. బాదం పప్పులు మరీ ఎక్కువగా తింటే వేడి చేస్తాయి. కాబట్టి… రోజూ యావరేజ్‌గా 4 పప్పులు తినాలి. దీనివల్ల శరీరంలో చెడు కొవ్వు కరిగిపోయి… స్లిమ్‌గా తయారవుతారు.
పుల్లగా, తియ్యగా ఉండే డ్రై క్రాన్బెర్రీస్లో యాంథోసియానిన్స్ ఉంటాయి. ఇవి కాన్సర్ అంతుచూస్తాయి. బాడీలో వేడి తగ్గించి, చలవ చేస్తాయి. మల, మూత్ర నాళ సమస్యలు ఉంటే ఈ పండ్లు పోగొడతాయని న్యూట్రిషన్ జర్నల్‌లో ఓ అధ్యయనం చెబుతోంది. డ్రై ఫ్రూట్స్‌లో మైక్రో న్యూట్రియంట్స్, కాల్షియం, విటమిన్స్, మినరల్స్ బాగా ఉంటాయి. ఇవి శారీరకంగా ఫిట్‌గా ఉండేలా చేస్తాయి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- almond
- Dry fruits
- pista
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

