వేసవిలో శరీరాన్ని చల్లబరిచే ఈ పానీయాలు తీసుకోవాలి..!

హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య గడప దాటి బయటకు రావాలంటే జనం హడలిపోతున్నారు. అయితే ఈ తీవ్రమైన ఎండల వల్ల శరీరం డీ హైడ్రేషన్‌కు గురవుతుంది. దీంతో వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితి రాకూడదంటే మన శరీరాన్ని చల్లబరిచే పానీయాలు ఎక్కువగా తీసుకోవాలి. మరి ఆ పానీయాలేంటో ఒకసారి చూద్దామా..!
- చల్ల: పెరుగులో కావాల్సినన్ని నీళ్లు పోసుకుని గిలకొట్టి చల్ల చేసుకోవాలి. ఈ చల్లలో నిమ్మ ఆకులు వేసి, కొంచెం ఉప్పు, కరివేపాకు చేర్చి తాగితే ఒంట్లో వేడి దెబ్బకు తగ్గిపోతుంది.
- జల్జీరా: నాలుగు చెంచాల ఆమ్చూర్ పొడి, అంతే పరిమాణంలో మెంతి పొడి, అర చెంచా వేయించిన జీలకర్ర పొడి, రెండు చెంచాల నల్ల ఉప్పు, చక్కెర, అర చెంచా మిరియాల పొడి కలిపి మిశ్రమంగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని చల్లటి నీళ్లలో కలిపితే జల్జీరా మిశ్రమం రెడీ అవుతుంది. అది తాగితే డీ హైడ్రేషన్ సమస్య వెంటనే తగ్గిపోతుంది.
- కొబ్బరి నీళ్లు: ఎండ తీవ్రత విపరీతంగా ఉన్నప్పుడు ఒక్కోసారి అకస్మాత్తుగా ఒళ్లంతా నిస్సత్తువగా మారుతుంది. నీరసం ఆవహిస్తుంది. ఇలాంటి సందర్భంలో కొబ్బరి నీళ్లు తాగితే తక్షణమే ఉపశమనం లభిస్తుంది.
- షర్బత్: వేసవిలో బాడీని డీ హైడ్రేషన్ నుంచి కాపాడుకోవడంలో షర్బత్ బాగా పనిచేస్తుంది. గ్లాసెడు నీళ్లలో సగం నిమ్మకాయ పిండుకుని రెండు టీ స్పూన్ల చక్కెర కలుపుకుని షర్బత్ చేసుకుని తాగొచ్చు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి.
మునక్కాయల కన్న మునగాకే మిన్న..!
కేంద్రమంత్రి జితేంద్రసింగ్‌కు కరోనా
మే 1 వరకు తెలంగాణలో నైట్ కర్ఫ్యూ
సంచలన నిర్ణయం తీసుకున్న ఛార్మీ
ఐసీఎస్ఈ 10వ బోర్డు పరీక్షలు రద్దు..
వ్యాక్సిన్లపై దిగుమతి సుంకం ఎత్తివేత!
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fake Potatoes | మార్కెట్లో విరివిగా కల్తీ ఆలుగడ్డలు.. గుడ్డిగా కొనుగోలు చేస్తే అంతే సంగతి..!
Team India | దక్షిణాఫ్రికా పర్యటనకు భారత మహిళా క్రికెట్ జట్టు.. డిసెంబర్ 9న టూర్ షురూ..!
Almonds | రోజూ కొన్ని బాదంపప్పులను తినడం వల్ల శరీరంలో జరిగే మార్పులు ఇవే.. అధ్యయనాల్లో తేలిన నిజాలు..
Sheikh Hasina | తిరిగి రావడానికి కొత్త పాస్‌పోర్ట్ ఇవ్వండి.. బంగ్లాదేశ్‌ను కోరిన షేక్ హసీనా..!
కారేపల్లి ఎస్ఐగా రమేశ్ బాధ్యతలు స్వీకరణ
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

