మునక్కాయల కంటే మునగాకే ఆరోగ్యకరం..!

హైదరాబాద్: మునక్కాయ చారు! మునక్కాయ పప్పు! మునక్కాయ టమాటా! ఇలా మునక్కాయలను ఎన్నో రకాలుగా వంటల్లో ఉపయోగించుకోవచ్చు! అంతేగాదు, మునక్కాయలతో చేసిన ఏ వంటకమైనా ఎంతో రుచిగా ఉంటుంది. రుచితోపాటు మునక్కాయల్లో ఆరోగ్యానికి కావాల్సిన ఎన్నో పోషకాలు కూడా ఉంటాయి. అయితే, ఆ పోషకాలు మునక్కాయల్లో కంటే మునగాకులో ఇంకా ఎక్కువగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మునగాకును ఆకు కూరగానో, పప్పులో కలెగూరగానో లేదంటే పచ్చడిగానో చేసుకుని తినడంవల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుందని అంటున్నారు. మరి మునగాకు చేసే మేలు ఎంతో తెలుసుకుందామా..!
- వర్షాకాలంలో మునగాకును ఎక్కువగా వాడటంవల్ల వ్యాధి నిరోధకశక్తి పెరుగుతుంది. అంతేగాక ఈ కాలంలో తరచుగా వచ్చే జలుబు, దగ్గులాంటి ఇబ్బందుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
- పాలకూరతో పోలిస్తే మునగాకులో మూడు రెట్లు ఎక్కువగా ఇనుము ఉంటుంది. అరటిపండు కంటే ఏడు రెట్లు ఎక్కువగా మెగ్నీషియం లభిస్తుంది. పాలల్లో కంటే రెండు రెట్లు ఎక్కువగా ప్రొటీన్లు ఉంటాయి. ఈ ఇనుము, మెగ్నీషియం మనల్ని త్వరగా అలసటకు గురికాకుండా కాపాడుతాయి.
- మునగాకులో ఎక్కువగా ఉండే పీచువల్ల కాస్త తినగానే కడుపు నిండిన భావన కలుగుతుంది. అందువల్ల మునగాకును నిత్యం వాడటంవల్ల అతిగా తినడం అనే సమస్య తీరుతుంది.
- మునగాకులోని విటమిన్-ఎ చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది. అమైనో ఆమ్లాలు ప్రొటీన్ ఉత్పత్తికి తోడ్పతాయి. ఈ ప్రొటీన్ జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. కడుపులోని పుండ్లు, ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది.
- మునగాకులో ఉండే క్లోరోజెనిక్ ఆమ్లం కొవ్వును కరిగిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడంలో సాయపడుతుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి.
మే 1 వరకు తెలంగాణలో నైట్ కర్ఫ్యూ
సంచలన నిర్ణయం తీసుకున్న ఛార్మీ
ఐసీఎస్ఈ 10వ బోర్డు పరీక్షలు రద్దు..
వ్యాక్సిన్లపై దిగుమతి సుంకం ఎత్తివేత!
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

