అధిక బరువు.. మెదడుకు చేటు
ఊబకాయం అంటే ఇన్నాళ్లూ శారీరక సమస్యగానే భావించేవారు. కానీ, అధిక బరువు వల్ల మానసిక ఇబ్బందులు కూడా తలెత్తుతాయని పరిశోధకులు చెబుతున్నారు. పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం వల్ల గుండె జబ్బులు, డయాబెటిస్ లాంటి వ్యాధులతోపాటు మెదడు ఆరోగ్యానికీ ముప్పేనని హెచ్చరిస్తున్నారు.
ఊబకాయం అంటే ఇన్నాళ్లూ శారీరక సమస్యగానే భావించేవారు. కానీ, అధిక బరువు వల్ల మానసిక ఇబ్బందులు కూడా తలెత్తుతాయని పరిశోధకులు చెబుతున్నారు. పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం వల్ల గుండె జబ్బులు, డయాబెటిస్ లాంటి వ్యాధులతోపాటు మెదడు ఆరోగ్యానికీ ముప్పేనని హెచ్చరిస్తున్నారు. ఇజ్రాయెల్‌లోని బెన్-గురియన్ యూనివర్సిటీ ఆఫ్ ది నెగెవ్ తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనం.. అధిక బరువు వల్ల మెదడుకు కలిగే ముప్పును బయటపెట్టింది. ఊబకాయంతో ముడిపడి ఉన్న కొన్ని కొవ్వు అణువులు శరీర కణజాలాల నుంచి మెదడుకు చేరుతున్నాయట. అక్కడ మెదడు కణాల మధ్య సమాచార మార్పిడికి అంతరాయం కలిగించి.. డిమెన్షియా, అల్జీమర్స్ లాంటి సమస్యలకు కారణం అవుతున్నాయట.
అల్జీమర్స్‌తో బాధపడుతున్న ఊబకాయుల ఎంఆర్ఐ రిపోర్టులను క్షుణ్నంగా పరిశీలించిన తర్వాత ఈ విషయాన్ని తేల్చినట్లు పరిశోధకులు వెల్లడించారు. పొట్ట భాగంలో అంతర్గత కొవ్వు పెరిగే కొద్దీ మెదడు పరిమాణం క్షీణిస్తుందని, మెదడు వృద్ధాప్యం వేగవంతం అవుతుందని వారు గుర్తించారు.
ఫలితంగా, వారిలో జ్ఞాపకశక్తి తగ్గడం, ఇతర ఆలోచనాత్మక లోపాలు వచ్చే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు. అయితే, బరువు తగ్గడం వల్ల ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చట. ‘గ్రీన్ మెడిటరేనియన్ డైట్’ లాంటి ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లు, క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని పాటించడం ద్వారా మెదడు ఆరోగ్యం మళ్లీ మెరుగుపడుతుందని అంటున్నారు. పొట్ట దగ్గర కొవ్వును తగ్గించుకుంటే, మెదడు క్షీణత ప్రక్రియ కూడా మందగిస్తుందని చెబుతున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
Bathukamma | బతుకమ్మకూ నీళ్లులేవు.. కాంగ్రెస్ తెచ్చిన దుర్గతి… వరంగల్ జిల్లా ఆరెపల్లిలో కాలువకు బావినీరే గతి
IND vs WI | ఎవరిదో ఫైనల్ పంచ్.. నేడు భారత్-వెస్టిండీస్ చివరి టీ20!
Starlink vs Jio | పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

