ఏం చేయకున్నా అలసిపోయినట్టు అనిపిస్తుందా? ఈ లోపమే కారణం!!
Magnesium | అకారణంగా అలసిపోతున్నామని, కాళ్లలో తిమ్మిర్లు వస్తున్నాయని, తలలో భారంగా ఉంటున్నదని కొంతమంది ఫిర్యాదు చేస్తుంటారు. మరికొందరిలో నరాల సమస్యలు కూడా కనిపిస్తాయి. మెగ్నీషియం లోపం వల్ల ఇలా జరిగే ఆస్కారం ఉంది.
మెగ్నీషియం.. మన శరీరంలో మూడువందల జీవరసాయన చర్యలకు బాధ్యత వహిస్తుంది. వీటిలో నరాలూ కండరాల పనితీరు, పేగులూ ఎముకల ఆరోగ్యం, రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయుల నియంత్రణ.. ఇలా ఎన్నో అంశాలు ముడిపడి ఉన్నాయి. ఒంట్లో శక్తి ఉత్పత్తిలో మెగ్నీషియం కీలకపాత్ర పోషిస్తుంది. నిద్ర హార్మోను మెలటోనిన్‌కు ఉత్ప్రేరకంగానూ పనిచేస్తుంది. ఇది నిద్ర బాగా పట్టేందుకు సహకరిస్తుంది. ఇవన్నీ.. మన శరీరానికి సంబంధించి మెగ్నీషియం నిర్వర్తించే కొన్ని ముఖ్య విధులు. అయితే, అపసవ్య జీవనశైలి మన
శరీరంలో మెగ్నీషియం నిల్వలు తగ్గిపోవడానికి కారణం అవుతున్నది.
ఇలా అయితే మేలు..
సహజంగానే శరీరంలో మెగ్నీషియం స్థాయులు పెంచుకునే మార్గాలు అనేకం.
♦ కకోవా గింజల పొడిలో మెగ్నీషియం సహా ఎన్నో పోషకాలు ఉంటాయి. దీనివల్ల నరాల పనితీరు మెరుగుపడుతుంది. మెదడు ఉపశమనం చెందుతుంది. 15 20 రోజులపాటు ఏవైనా పండ్లలో అర టీస్పూన్ కకోవా పొడి కలుపుకొని తింటే మంచిది.
♦ తల భారం, పార్శపు నొప్పి ఉన్నవారికి బాదంపప్పు మంచి చేస్తుంది. ఎందుకంటే ఇందులో మెగ్నీషియం, ఇతర ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. బాదంపప్పులో ఉండే సాలిసిన్ శరీరంలో సాలిసైక్లిక్ ఆమ్లంగా మారుతుంది. నొప్పి నివారణ బిళ్ల ఆస్పిరిన్‌లో ప్రాథమికంగా ఉండేదీ ఇదే. కాబట్టి రోజూ నానబెట్టిన బాదంపప్పులను తీసుకుంటే సహజ పద్ధతిలో నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.
♦ తాజా ఆకుపచ్చని కూరగాయలు మెగ్నీషియం, క్లోరోఫిల్‌కు మంచి వనరులు. వీటివల్ల పేగులు ఆరోగ్యంగా ఉంటాయి. విసర్జక వ్యవస్థ సజావుగా సాగుతుంది. తాజా ఆకుకూరలను భోజనంలో భాగం చేసుకుంటే ప్రయోజనాలు అనేకం.
♦ అవకాడో మెగ్నీషియానికి మంచి వనరు. ఇది మన శరీరానికి అవసరమైన కొవ్వులను అందిస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రయోజనాలనూ కలిగి ఉంటుంది. అవకాడోను సలాడ్స్‌లో భాగం చేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది.
Read More :
“Breakfast | రోజూ ఉదయం కచ్చితంగా బ్రేక్‌ఫాస్ట్ చేయాలా?”
Hair fall | రోజూ ఈ గింజలు తింటే మీ జుట్టు పట్టులా దృఢంగా అవుతుంది !!”
డీహైడ్రేషన్‌తో బాధపడుతున్నారా.. ఇవి తింటే చాలు!”
“Healty Food | ఈ ఫుడ్ తింటే పదేండ్లు అధికంగా బతకొచ్చు!!”
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- Food
- Health
- Health news
- magnesium
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

