Helth Tips | ఏరోబిక్స్‌తో పోస్ట్ కోవిడ్ లక్షణాల నుంచి ఉపశమనం
లాంగ్ కోవిడ్ రోగులు ప్రణాళికాబద్ధంగా ఎనిమిది వారాల వర్కవుట్ ప్రోగ్రామ్‌తో పోస్ట్ కోవిడ్ లక్షణాలతో దీటుగా పోరాడగలుగుతారని తాజా అధ్యయనం (Helth Tips) వెల్లడించింది.
లండన్ : లాంగ్ కోవిడ్ రోగులు ప్రణాళికాబద్ధంగా ఎనిమిది వారాల వర్కవుట్ ప్రోగ్రామ్‌తో పోస్ట్ కోవిడ్ లక్షణాలతో దీటుగా పోరాడగలుగుతారని తాజా అధ్యయనం (Helth Tips) వెల్లడించింది. కోవిడ్ బారినపడిన మూడు నెలల తర్వాత కూడా లక్షణాలు కొనసాగడం, తీవ్రం కావడం కనిపిస్తే ఆ స్ధితిని లాంగ్ కోవిడ్, పోస్ట్ కోవిడ్‌గా వ్యవహరిస్తారు. లాంగ్ కోవిడ్ రోగుల్లో సాధారణంగా తీవ్ర అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ఒళ్లు నొప్పులు, మానసిక అలజడి వంటి లక్షణాలు కనిపిస్తాయి.
ప్రస్తుతం లాంగ్ కోవిడ్, పోస్ట్ కోవిడ్ లక్షణాలకు డబ్ల్యూహెచ్ఓ జారీ చేసిన స్వయం నియంత్రిత మార్గదర్శకాలనే సిఫార్సు చేస్తున్నారు. అయితే నిపుణుల పర్యవేక్షణలో ఏరోబిక్, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కాంబినేషన్‌తో కూడిన వ్యాయామంతో మెరుగైన ఫలితాలు ఉంటాయని స్పెయిన్‌కు చెందిన యూనివర్సిటీ ఫ్ ముర్సియ పరిశోధకులు చేపట్టిన అధ్యయనం వెల్లడించింది.
ఈ అధ్యయనంలో భాగంగా వారానికి రెండు సెషన్స్ స్ట్రెంత్ ట్రైనింగ్‌తో పాటు తేలికపాటి ఏరోబిక్ ఎక్సర్సైజ్, ఓ మోస్తరు ఏరోబిక్ ఎక్సర్సైజ్ సెషన్స్‌లో పాల్గొన్న వారిలో పోస్ట్ కోవిడ్ లక్షణాలు తగ్గినట్టు గుర్తించారు. అలసట, కుంగుబాటు వంటి లక్షణాల నుంచి ఉపశమనం లభించిందని వెల్లడైంది. శారీరక పటుత్వం కూడా మెరుగైందని పరిశోధకులు గుర్తించారు. అధ్యయన వివరాలు జర్నల్ ఆఫ్ అప్లయిడ్ ఫిజియాలజీలో ప్రచురితమయ్యాయి.
Read More :
Health Tips | పుదీనాతో కలిగే ఈ ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా..?
Health Tips | అనాసతో అన్నీ లాభాలే…..
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- brain
- covid
- Depression
- exercise
RELATED ARTICLES
తాజా వార్తలు
Kodangal | కొడంగల్‌లో కేజీబీవీ భవనంపై నుంచి పడి విద్యార్థినికి తీవ్ర గాయాలు.. సమాచారాన్ని గోప్యంగా ఉంచిన అధికారులు
Netflix | ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు!
Pony Verma | రాజకీయల వల్లే ప్రకాశ్‌రాజ్‌ని సినిమాల నుంచి తొలగించారు: పోని వర్మ
Harish rao | నో పబ్లిక్ ఇంట్రెస్ట్.. ఓన్లీ ప్రైవేట్ ఇంట్రెస్ట్.. సీఎం రేవంత్ సర్కార్ గెజిట్‌పై హరీశ్ రావు
White Noise Machine | నిద్రలేమి సమస్యను తగ్గించే వైట్ నాయిస్ యంత్రం.. అసలేమిటిది.. ఎలా పనిచేస్తుంది..?
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

