నిద్ర సుఖమెరుగదని పెద్దల మాట. అదే నిద్రను మనం నిర్లక్ష్యం చేస్తే.. జీవితంలో సుఖం అనేదే లేకుండా పోతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మన ఫెర్టిలిటీని చంపేసే అతిపెద్ద శత్రువు నిద్రలేమే! అందుకే వైద్యులు నిద్రలేమిని ‘బిగ్గెస్ట్ ఫెర్టిలిటీ కిల్లర్’ అంటున్నారు!’
లా మార్చేశాం. రాత్రిళ్లు ఫోన్లు చూడటం, అర్ధరాత్రి దాకా పని చేయడం లేదా వెబ్ సిరీస్‌లు చూడటం ఈ రోజుల్లో చాలా నార్మల్ అయిపోయింది. దీనివల్ల అలసట, తలనొప్పి రావడం మనకు తెలుసు. కానీ, నిద్రలేమి అనేది అటు పురుషుల్లో, ఇటు మహిళల్లో సంతానోత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బతీస్తుందని గైనకాలజిస్ట్లు హెచ్చరిస్తున్నారు. అసలు మన నిద్రకి, మన శరీరంలోని ‘ఇంటర్నల్ క్లాక్’కి ఉన్న లింక్ ఏంటి?
హార్మోన్ల కన్ఫ్యూజన్ మన శరీరం 24 గంటల అంతర్గత గడియారం ప్రకారం పనిచేస్తుంది. దీన్నే సైన్స్ భాషలో ‘సిర్కాడియన్ రిథమ్’ అంటారు. టైమ్ మారితే రిథమ్ తప్పుతుంది. పడుకునే సమయం రోజుకో తీరుగా మారుతుంటే, మన శరీరంలోని హార్మోన్లు కన్ఫ్యూజ్ అయిపోతాయి. ఓవులేషన్ హార్మోన్లు రిలీజ్ అవ్వకుండా మొరాయిస్తాయి. ముఖ్యంగా మహిళల్లో అండం విడుదల కావడానికి అవసరమైన ఎల్‌హెచ్ లాంటి హార్మోన్లు మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడే విడుదలవుతాయి. నిద్ర సరిగ్గా లేకపోతే ఓవులేషన్ ఆలస్యం అవ్వడం లేదా అసలు జరగకపోవడం లాంటి సమస్యలు తలెత్తుతాయి.
నిద్ర తక్కువైతే మహిళల శరీరంలో కార్టిసాల్ (స్ట్రెస్ హార్మోన్), మెలటోనిన్ లెవల్స్ తలకిందులవుతాయి. అన్నీ బ్యాలెన్స్ తప్పుతాయి. ఇది నేరుగా ఈస్ట్రోజన్-ప్రొజెస్టెరాన్ బ్యాలెన్స్‌ను దెబ్బతీస్తుంది. అంతేకాదు.. పీరియడ్స్‌లో మార్పులు వస్తాయి. ఫలితంగా అండం నాణ్యత తగ్గడం, గర్భం దాల్చడంలో ఇబ్బందులు ఎదురవుతాయి.
పురుషులపై కూడా నిద్రలేమి ప్రభావం తీవ్రంగా ఉంటుంది. టెస్టోస్టిరాన్ లోపం: నిద్ర సరిగ్గా లేని పురుషుల్లో టెస్టోస్టిరాన్ లెవల్స్ తగ్గిపోతాయి. స్పెర్మ్ క్వాలిటీ: ఇది నేరుగా స్పెర్మ్ కౌంట్, దాని కదలిక, ఆకృతిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. కొద్దిరోజుల పాటు నిద్రను నిర్లక్ష్యం చేసినా ఈ మార్పులు కనిపిస్తాయట.
ఇన్సులిన్-స్ట్రెస్: నిద్రలేమి వల్ల శరీరంలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. అంటే ఇది ఒబేసిటికి దారితీయడమే కాకుండా శరీరంలో వాపు, ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ని పెంచుతుంది. ఇవన్నీ కలిసి ఫెర్టిలిటీని దెబ్బతీస్తాయి. సంతానోత్పత్తి సామర్థ్యం కేవలం వయసు లేదా శరీర నిర్మాణం మీద మాత్రమే ఆధారపడి ఉండదు. ఈ విషయంలో మన జీవనశైలి కూడా ప్రభావం చూపుతుంది. అందుకే.. నిద్ర అనేది లగ్జరీ కాదు, అది మన రీప్రొడక్టివ్ హెల్త్‌కి ఒక ‘బయోలాజికల్ అవసరం’ అని గుర్తించండి. కంటి నిండా నిద్రపోవడాన్ని అలవాటుగా చేసుకోండి.