న్యూఢిల్లీ : నవరాత్రి ఉపవాసాలు అటు భక్తికి, ఆద్యాత్మికతతో ముడిపడి ఉన్నా బరువు తగ్గేందుకు (Weight Loss) కూడా ఇది అద్భుత అవకాశంగా ముందుకొస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. నవరాత్రుల్లో ఆరోగ్యకర ఆహారంతో బరువు తగ్గించుకునేందుకు అవకాశంగా చూడాలని పేర్కొంటున్నారు. సాత్వికాహారంతో అనేక రుగ్మతలను తొలగించడంతో పాటు అధిక బరువు సమస్యనూ వదిలించుకోవచ్చు. సాత్వికాహారం మన శరీరాన్ని తేలికపరచడంతో పాటు శరీరానికి ఉత్తేజాన్ని ఇస్తూ మలినాలను తొలగిస్తుంది.
ఈ ఆహారంతో సులభంగా బరువు తగ్గే అవకాశం ఉంది. నవరాత్రుల్లో ఉపవాసం, ఆరోగ్యకర ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యకరంగా, శక్తిని పొందడం, జలుబు, దగ్గు వంటి అనారోగ్యాలను నివారించవచ్చు. నవరాత్రి ఉత్సవాల్లో సరైన డైట్ ప్లాన్‌ను అనుసరించడం ద్వారా బరువు తగ్గవచ్చని న్యూట్రిషనిస్ట్ శిఖా సింగ్ సూచించారు. తొమ్మిది రోజుల వేడుకల్లో సరైన ఆహారం తీసుకుంటూ 5 కిలోల వరకూ బరువు తగ్గవచ్చని ఆమె చెబుతున్నారు. ప్రతిరోజూ రాత్రి 7-8 గంటల నిద్ర కీలకమని, విశ్రాంతితోనే శరీరం తిరిగి ఉత్తేజితం అవుతుందని శిఖా సింగ్ సూచిస్తున్నారు. శరీరానికి తగిన విశ్రాంతితో పాటు రోజూ మూడు నుంచి మూడున్నర లీటర్ల నీటిని తాగి డీహైడ్రేషన్ బారినపడకుండా చూసుకోవాలి.
మనం తీసుకునే ఆహారాన్ని, శరీర బరువును గమనిస్తుండాలి. శరీరంలో జీవక్రియల వేగం పెరిగేందుకు, ఒత్తిడి తగ్గించుకునేందుకు శారీరకంగా చురుకుగా ఉండాలి. జీర్ణశక్తి మెరుగై బరువును నియంత్రించేందుకు రాత్రి 7 గంటల్లోగా డిన్నర్ ముగించాలి. ఇక వెయిట్ లాస్ డైట్ ప్లాన్ విషయానికి వస్తే ఉదయం 7 గంటలకు ఇలాచి వాటర్‌తో రోజును ప్రారంభించాలి.8 గంటల సమయంలో బ్రేక్‌ఫాస్ట్‌లో మిల్లెట్ రోటి, ఆలూ సబ్జి తీసుకుని పదిగంటలకు ఒకట్రెండు పండ్లను తీసుకోవాలి. ఆపై మధ్యాహ్నం 12 గంటలకు లంచ్‌లో ఉడకబెట్టిన పల్లీలు, బాదం, జీడిపప్పు, బనానా తీసుకోవాలి. ఇక సాయంత్రం 4 గంటలకు కొబ్బరినీళ్లు, నిమ్మరసం లేదా గ్రీన్ టీ తాగాలి. రాత్రి ఏడు గంటలకు దహి ఆలు వంటి పదార్ధాలతో డిన్నర్ తేలికగా ముగించాలి.
Read More
Israel-Hamas War | రాకెట్ ప్రయోగానికి ముందు, ఆ తర్వాత.. గాజా ఆసుపత్రి ఇలా.. VIDEO