న్యూఢిల్లీ : శరీరానికి పండ్లు తక్షణ శక్తిని అందించి ఉత్సాహంగా పనిచేసేందుకు ఉపకరిస్తాయి. అయితే ఆరోగ్య ప్రయోజనాల కోసం పండ్ల రసాలను తీసుకోవాలా నేరుగా పండ్లను తీసుకోవాలా (Fruits vs Fruit juice) అనే సందేహాలు చాలా మందిలో వ్యక్తమవుతుంటాయి. పండ్ల రసాల్లో విటమిన్లు, ప్లాంట్ కెమికల్స్ ఉన్నా ఫైబర్, పండ్లలో ఉండే ఇతర పోషకాలు జ్యూస్‌ల్లో లభించవు. పండ్లలో ఉండే డైటరీ ఫైబర్ రక్తంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించడంతో పాటు హృద్రోగ ముప్పును తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఫ్రూట్ జ్యూస్‌ల్లో ఫైబర్ లేకపోవడం ప్రధాన లోపం. ఫైబర్ అధికంగా ఉండే పండ్లు తీసుకుంటే మలబద్ధకం నివారించడంతో పాటు తక్కువ క్యాలరీలతోనే కడుపు నిండిన భావన కలగడంతో బరువు పెరిగే సమస్య తలెత్తదు. ఆపై ఫైబర్‌తో కూడిన పండ్లతో ప్రేవుల ఆరోగ్యం మెరుగవుతుంది. ఇక పండ్లతో పోలిస్తే ఫ్రూట్ జ్యూస్‌లో అధిక క్యాలరీలతో పాటు అధిక షుగర్ ఉంటుంది.
దీంతో ఫ్రూట్ జ్యూస్‌లతో రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగడంతో పాటు బరువు పెరిగే అవకాశం ఉంది. ఫ్రూట్ జ్యూస్ తీసుకుంటే ఫైబర్ లేని అధిక క్యాలరీలు శరీరంలోకి తీసుకున్నట్టేనని ప్రముఖ పోషకాహార నిపుణులు లవ్‌నీత్ బాత్రా చెబుతున్నారు. ఇక పండ్ల రసాల కంటే పండ్ల ముక్కలు తీసుకుంటే ఫైబర్‌తో పాటు సూక్ష్మపోషకాలు, బయోయాక్టివ్ పదార్ధాలు శరీరానికి మేలు చేస్తాయని చెప్పారు. ఫ్రూట్స్‌తో ఫైబర్ తగినంత లభిస్తుందని బ్లడ్ షుగర్ లెవెల్స్ మెరుగై, సమతులాహారం శరీరానికి లభిస్తుందని ఇన్స్టాగ్రాం రీల్లో ఆమె పేర్కొన్నారు.
Read More :
Raj Bhavan | కర్ణాటక రాజ్‌భవన్‌కు బాంబు బెదిరింపులు.. అప్రమత్తమైన అధికారులు