న్యూఢిల్లీ : పాలు, పాల ఉత్పత్తులు తీసుకునే కొందరిలో ముఖ్యంగా లాక్టోజ్ పడనివారిలో వీటిని తీసుకున్న వెంటనే కడుపుబ్బరం, వికారం వంటి ఇబ్బందులు (Health Tips) తలెత్తుతాయి. పాలు, పాల ఉత్పత్తులు తీసుకోవడం వల్ల కడుపుబ్బరం వంటి సమస్యలు ఎందుకు తలెత్తుతాయి, వాటి నుంచి ఎలా బయటపడవచ్చనే అంశాలను న్యూట్రిషనిస్ట్ అంజలి ముఖర్జీ వివరించారు.
పాల ఉత్పత్తులతో కడుపుబ్బరం వంటి సమస్యలు తలెత్తే వారు ఆహారం నుంచి డైరీ ఉత్పత్తులను తగ్గించడం లేదా పూర్తిగా మానివేయడం మేలని అంజలి సూచిస్తున్నారు. బాదం పాలు, సోయా పాలు, ఓట్ మిల్క్ వంటి లాక్టోజ్ రహిత పాలను తీసుకోవచ్చని చెబుతున్నారు. యోగర్ట్ వంటి పులిసిన పాల ఉత్పత్తులు, తక్కువ లాక్టోజ్ ఉండే వెన్న వంటి పదార్ధాలను తీసుకోవచ్చని, వీటిలో ప్రొబయాటిక్స్ ఆరోగ్యానికి మేలు చేస్తాయని, జీర్ణక్రియ సాఫీగా సాగేలా చూస్తాయని చెప్పారు.
లాక్టోజ్ పడనివారు డైరీ ఉత్పత్తులను తీసుకునేముందు లాక్టోజ్ సప్లిమెంట్స్ తీసుకోవడం ద్వారా మెరుగైన ఫలితాలు ఉంటాయి. లాక్టోజ్ సరిపడకపోవడంతో అంతగా బాధపడని వారు తమ ఆహారంలో పరిమితంగా మిల్క్, డైరీ ఉత్పత్తులను మెల్లిగా తీసుకోవడం ప్రారంభించాలి. శరీరం ఈ ఆహారానికి అలవాటు పడేలా చేస్తే కడుపుబ్బరం, వికారం వంటి సమస్యలను అధిగమించవచ్చు.
Read More :