Hotel as Home | హోటల్ రూమ్‌ను ఇంటిగా మార్చుకున్న కుటుంబం.. జీవితాంతం అక్కడే ఉండాలని నిర్ణయం
Hotel as Home | ఒక కుటుంబం బస చేస్తున్న లగ్జరీ హోటల్ గదిని తమ ఇంటిగా మార్చుకున్నది. (Hotel as Home) రోజుకు సుమారు రూ.11,000 చెల్లిస్తూ ఏడు నెలలకుపైగా అక్కడే ఉంటున్నది. నీరు, కరెంట్, కారు పార్కింగ్ వంటి అదనపు ఖర్చులు లేకపోవడంతో వారికి డబ్బు కూడా ఆదా అవుతోంది. దీంతో జీవితమంతా ఆ హోటల్ గదిలోనే నివసించాలని ఆ కుటుంబం నిర్ణయించింది.
బీజింగ్: ఒక కుటుంబం బస చేస్తున్న లగ్జరీ హోటల్ గదిని తమ ఇంటిగా మార్చుకున్నది. (Hotel as Home) రోజుకు సుమారు రూ.11,000 చెల్లిస్తూ ఏడు నెలలకుపైగా అక్కడే ఉంటున్నది. నీరు, కరెంట్, కారు పార్కింగ్ వంటి అదనపు ఖర్చులు లేకపోవడంతో వారికి డబ్బు కూడా ఆదా అవుతోంది. దీంతో జీవితమంతా ఆ హోటల్ గదిలోనే నివసించాలని ఆ కుటుంబం నిర్ణయించింది. చైనాలో ఈ సంఘటన జరిగింది. చిన్న పిల్లలతో సహా ఎనిమిది మంది సభ్యులున్న ఒక కుటుంబం అసాధారణంగా జీవిస్తున్నది. హెనాన్ ప్రావిన్స్ నాన్యాంగ్ నగరంలోని ఒక లగ్జరీ హోటల్లో 229 రోజులకుగాపైగా బస చేస్తున్నది. ఒక లివింగ్ రూమ్, రెండు గదులతో కూడిన సూట్లో వారు నివసిస్తున్నారు. ఎక్కువ కాలం ఉండేందుకు ఒప్పందం చేసుకోవడంతో ప్రత్యేక రేట్ కింద రోజుకు 1000 యువాన్లు (సుమారు రూ.11,000) చెల్లిస్తున్నారు.
కాగా, తమకు ఆరు ఆస్తులున్నాయని, ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్నట్లు ఆ కుటుంబానికి చెందిన ఒక మహిళ తెలిపారు. హోటల్లో ప్రతిదీ సౌకర్యవంతంగా ఉందని, తామంతా సంతోషంగా ఉన్నామని చెప్పారు. విద్యుత్, నీరు, పార్కింగ్, హీటింగ్ వంటి అదనపు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. ఈ జీవన విధానం వల్ల డబ్బు ఆదా అవుతుందని తాను ఎప్పుడూ అనుకోలేన్నారు. అందుకే జీవితాంతం విలాసవంతమైన ఈ హోటల్లో జీవించాలని ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించారు.
మరోవైపు, అసాధారణంగా హోటల్లో జీవిస్తున్న ఆ కుటుంబం ఫొటోలు, వీడియోలతో కూడిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆ కుటుంబం జీవిత విధానాన్ని కొందరు నెటిజన్లు సమర్థించారు. అయితే ఇంటితో పోల్చితే హోటల్లో జీవించడం అంత సౌకర్యంగా ఉండదని మరికొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు.
కాగా, చైనా రియల్ ఎస్టేట్ సంస్థ అంచనా ప్రకారం షాంఘైలో డబుల్ బెడ్ రూమ్ అపార్ట్మెంట్ అద్దె నెలకు సుమారు 20,000 యువాన్లు (రూ. 2,37,281). వాటర్, కరెంట్, పార్కింగ్ వంటి ఇతర అవసరాలకు విడిగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో 8 మంది సభ్యులున్న కుటుంబం హోటల్ బస, ఆహారం వంటి అన్ని ఖర్చులతో కలిపి నెలకు సుమారు 30,000 యువాన్లుగా పేర్కొంది. తద్వారా ఆ కుటుంబానికి డబ్బు బాగా ఆదా అవుతోందని ఆ సంస్థ అంచనా వేసింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Chinese Family
- Hotel
- live
- New Home
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral Video | రీల్స్ పిచ్చిలో పెట్రోల్ తాగిన వ్యక్తి! .. సోషల్ మీడియాలో వీడియో వైరల్
Thiruveer | ‘భగవంతుడు’తో రాబోతున్న తిరువీర్.. రూరల్ పొలిటికల్ డ్రామాపై భారీ అంచనాలు!
Prabhas | ప్రభాస్ పుట్టినరోజు స్పెషల్.. ‘కల్కి 2’ నుంచి అదిరిపోయే అప్డేట్, మళ్లీ భైరవగా డార్లింగ్!
Tibet Earthquake: టిబెట్ భూకంపంలో 16 మంది మృతి.. 339 ఇండ్లు ధ్వంసం
Ranbir Kapoor | హైదరాబాద్ ఈవెంట్లో తళుక్కుమున్న రణబీర్ కపూర్.. ఆయన వాచ్ ధర ఎంతో తెలుసా?
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

