ఆ సమయంలో ఏం తినాలి?
రజస్వల అయినప్పుడు కారం తింటే కడుపులో నొప్పి వస్తుందన్న మాటలో ఎలాంటి శాస్త్రీయతా లేదు. కానీ, ఈ దశలో ఆడపిల్లలకు పౌష్టికాహారం చాలా అవసరం. రక్తహీనత, ఎముకల బలహీనత లాంటి సమస్యలు తలెత్తే సమయమిది.
మా దగ్గర రజస్వల అయితే తీపి పెడతారు. తొలి పదిరోజులూ కారం ఎక్కువగా లేని ఆహారమే ఇస్తారు. కారాలు తింటే మున్ముందు పొట్టలో నొప్పి వస్తుందని హెచ్చరిస్తారు. ఇదంతా నిజమేనా, అసలు అమ్మాయి రజస్వల అయినప్పుడు ఎలాంటి ఆహారం పెట్టాలి?
- ఓ పాఠకురాలు
రజస్వల అయినప్పుడు కారం తింటే కడుపులో నొప్పి వస్తుందన్న మాటలో ఎలాంటి శాస్త్రీయతా లేదు. కానీ, ఈ దశలో ఆడపిల్లలకు పౌష్టికాహారం చాలా అవసరం. రక్తహీనత, ఎముకల బలహీనత లాంటి సమస్యలు తలెత్తే సమయమిది. అందుకే క్యాల్షియం, ఐరన్, విటమిన్-డి అధికంగా లభించే ఆహారాలు పెట్టాలి. మనం కూడా రజస్వల అయిన ఆడపిల్లలకు నువ్వుల ముద్ద పెడతాం. ఇది మంచిదే. నువ్వుల్లో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది.
అమ్మాయి రజస్వల అయ్యాక తొలి ఆరు నెలలు సమతులాహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఎందుకంటే వీళ్లు పొడవు పెరిగే సమయం అదే. ఆ తర్వాత శరీరంలో ఈస్ట్రోజెన్ స్థాయులు పెరిగిపోతుంటాయి. ఫలితంగా ఎదుగుదల ఆగిపోతుంది. అందుకే, రజస్వల అయిన అమ్మాయికి విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉండే చక్కటి పౌష్టికాహారాన్ని అందించాలి. జంక్ ఫుడ్కు దూరంగా ఉండేలా చూడాలి. లావు అయితే మాత్రం హార్మోన్లలో తేడా వచ్చే ప్రమాదం ఉంది.
– డాక్టర్ పి. బాలాంబ సీనియర్ గైనకాలజిస్ట్
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Farmers Protest | విద్యుత్ సిబ్బంది పట్టించుకోవడం లేదు.. కరెంటు కోసం రైతుల రాస్తారోకో
‘యాసంగిలో రైతులు వరి సాగుకు దూరంగా ఉండాలి’
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Angomcha Bimol | ఆ ఎంపీని సస్పెండ్ చేయండి.. రాష్ట్రపతిని కలిసి ఫిర్యాదు చేసిన బీజేపీ మహిళా ఎంపీలు
Eye Sight | భారతీయుల్లో పెరుగుతున్న దృష్టి లోపం సమస్య.. జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

