Microwave Oven | ఓవెన్‌తో లాభాలు సరే, మైక్రోవేవ్స్ వల్ల ఆరోగ్యానికి లాభమా? నష్టమా? అనే విషయంలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఓవెన్లో ఉంచిన ఆహారంపై మైక్రోవేవ్‌లు ప్రసరించడం వల్ల ఆ పదార్థం వేడెక్కుతుందని మనకు తెలుసు. ఆ సమయం లోఆహారంలోని నీటి అణువులు చలనానికి లోనవుతాయి. దీనివల్ల ఆహార పదార్థాలలోని అణువులలో కూడా కదలిక వస్తుంది. అణువుల మధ్య ఘర్షణ తలెత్తుతుంది.
ఈ ఘర్షణ మూలంగా ఆహార పదార్థాల రసాయన సమ్మేళ నాలలో మార్పులు జరుగుతాయి. ఫలితంగా కొన్నిపోషకాలు తగ్గిపోవచ్చు, కొన్ని పూర్తిగా మాయమైపోవచ్చని హార్వర్డ్ పరిశోధకులు తేల్చారు. ఆహారాన్ని మైక్రోవేవ్స్తో ఓవెన్లో వేడి చేయడం వల్ల విటమిన్-సి పూర్తిగా నశించి పోతుంది. అందులోనూ, పాలలోని పోషక విలువలు నలభై శాతం మేర తగ్గిపోతున్నట్టు గుర్తించారు. ప్లాస్టిక్ పాత్రల్లో ఆహారాన్ని ఉంచి వేడి చేస్తాం కాబట్టి, అతికొద్ది పరిమాణంలో ప్లాస్టిక్ కరిగిపోయి ఆహారంతో కలుస్తున్నట్టు కూడా అనుమానాలు ఉన్నాయి. ఇప్పటికే ఓవెన్లు మన జీవితంలో ఓ భాగం అయిపోయాయి. హఠాత్తుగా వదులుకోలేం. సాధ్యమైనంత తక్కువసేపు ఆహారం ఓవెన్లో ఉండేలా జాగ్రత్త పడటం మినహా మారో మార్గం లేదు.
“Cellulite | మహిళల్లో ఎక్కువగా కనిపించే ఈ వ్యాధికి.. ఆముదానికి సంబంధమేంటి?”
“కూరలు, చారుల్లో ధనియాల పొడిని వేసుకుంటే ఇన్ని లాభాలు ఉన్నాయా!!”
రాత్రుళ్లు నిద్ర పట్టక ఇబ్బంది పడుతున్నారా.. ఒకసారి ఇలా చేసి చూడండి..”
Kashmiri Garlic | మన వెల్లుల్లికి కశ్మీరీ వెల్లుల్లికి తేడా ఏంటి? ఇది ఆరోగ్యానికి మంచిదేనా?”