Health Tips : ఆరోగ్యకర జీవనానికైనా, శారీరక శక్తిని పెంచేందుకైనా జీవక్రియల (మెటబాలిజం) పాత్ర అత్యంత కీలకం. కీలక శారీరక ప్రక్రియలను నియంత్రించే మెటబాలిజం రక్త ప్రసరణ, బరువు నియంత్రణలపై ప్రభావం చూపుతుంది. జీవక్రియల వేగం నెమ్మదిస్తేనే శరీరంలో కొవ్వు పెరుగుతుందనే అంచనాలకు విరుద్ధంగా శరీరంలో పేరుకుపోయిన అధిక కొవ్వు వల్లే మెటబాలిజం మందగిస్తుంది. కొవ్వును కరిగించడం ద్వారా మెటబాలిజంను ఎలా మెరుగుపరుచుకోవచ్చనే వివరాలను లైఫ్‌స్టైల్ ఫిట్నెస్ కోచ్ లూక్ కుటిన్హో ఇన్స్టాగ్రాం పోస్ట్‌లో వివరించారు.
శరీరంలో కొవ్వును కరిగించి కండరాలను బలోపేతం చేసుకోవడం ద్వారా మెటబాలిజంను ప్రేరేపించవచ్చని చెబుతున్నారు. ఒత్తిడిని వదిలించుకోవడం, ప్రొటీన్ ఆహారం అధికంగా తీసుకోవడం, జంక్ ఫుడ్‌కు దూరం కావడం, ఉపవాసం వంటి పద్ధతుల ద్వారా కొవ్వును కరిగించి మెటబాలిజం వేగవంతం చేయవచ్చని లూక్ సూచిస్తున్నారు. వ్యాయామం ద్వారా క్యాలరీలను ఖర్చు చేస్తూ బరువు తగ్గవచ్చని చెబుతున్నారు. ప్రొటీన్ అధికంగా ఉన్న ఆహార పదార్ధాలను తీసుకుంటే ఎక్కువ సమయం ఆకలి కాకుండా ఉంటుందని తద్వారా తక్కువ ఆహారం తీసుకుని బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుందని లూక్ పేర్కొన్నారు.
ప్రొటీన్ అధికంగా తీసుకోవడం ద్వారా జీవక్రియలు వేగవంతమై ఆరోగ్యానికీ మేలు చేకూరుతుంది. గాఢ నిద్రతో బరువు తగ్గడంతో పాటు శారీరక ఆరోగ్యం మెరుగవుతుంది. నిద్రలేమితో ఆకలిని నియంత్రించే హార్మోన్ లెవెల్స్ భగ్నమై అతిగా తినేందుకు ప్రయత్నిస్తుంటారని, గాఢ నిద్రతో ఈ సమస్యలను అధిగమించవచ్చని లూక్ చెబుతున్నారు. ఇక మనిషిని చిత్తు చేసే ఒత్తిడిని దూరం పెట్టడం అత్యంత కీలకం. ఒత్తిడితో సతమతమైతే అతిగా తినడం, బరువు పెరగడం వంటి సమస్యలు ఎదురవుతాయి. యోగ, మెడిటేషన్, వ్యాయామం వంటి ఒత్తిడిని దూరం చేసే యాక్టివిటీస్ అనుసరించాలి.
Read More :
Air India: మాస్కోలో ఎయిర్ ఇండియా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్