న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా(Air India)కు చెందిన విమానం.. మాస్కోలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసింది. దేశ రాజధాని ఢిల్లీ నుంచి బ్రిమింగ్హామ్ వెళ్తున్న ఆ విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో.. ముందస్తు జాగ్రత్తగా దాన్ని మాస్కోలో దించారు. అయితే అన్ని చెకింగ్లు నిర్వహించిన తర్వాత మళ్లీ ఆ విమానం మాస్కో నుంచి బయలుదేరింది. గురువారం తెల్లవారుజామున బ్రిమింగ్హామ్లో ఆ విమానం దిగింది. బోయింగ్ 787 విమానం.. ఫ్లయిట్ ఏఐ 113ని ఆపరేట్ చేసింది. అయితే ఎయిర్ ఇండియా సంస్థ నుంచి ఈ ఘటనపై అధికారిక ప్రకటన రాలేదు. సాంకేతిక సమస్యల వల్ల ముందు జాగ్రత్తగా మాస్కోలోని శెరిమెటయోవా విమానాశ్రయంలో ఆ విమానాన్ని దించామని, చెకింగ్ తర్వాత మళ్లీ ఆ విమానం ఎగిరినట్లు ఓ అధికారి తెలిపారు.