న్యూఢిల్లీ : పరీక్షల్లో చదివినవి గుర్తుకురాకపోవడం, ఏకాగ్రత లేకపోవడం, మతిమరుపు వంటి సమస్యలను పలువురు యువతీ యువకులు ఎదుర్కొనడం చూస్తుంటాం. అయితే టీనేజర్లతో పాటు పెద్దలు సైతం రోజూ గుప్పెడు వాల్నట్స్ తీసుకుంటే ఏకాగ్రత పెరగడంతో పాటు జ్ఞాపకశక్తి మెరుగవుతుందని (Health Tips)స్పానిష్ పరిశోధకులు చేపట్టిన అధ్యయనంలో వెల్లడైంది.
నిత్యం వాల్నట్స్ను తీసుకునేవారిలో మెదడు చురుకుగా పనిచేయడం, మానసిక పరిస్ధితిలో పరిపక్వత రావడం వంటి అంశాలను గుర్తించామని జర్నల్ ఈక్లినికల్ మెడిసిన్లో ప్రచురితమైన అధ్యయన వివరాలు వెల్లడించాయి. వాల్నట్స్లో ఒమెగా-3 తరహాలో అల్పా-లినోలెనిక్ ఫ్యాటీ ఆమ్లాలు ముఖ్యంగా వయోజనుల్లో మెదడు వృద్ధికి ఉపకరిస్తాయని పరిశోధకులు వెల్లడించారు. ఈ ఫ్యాటీ ఆమ్లాలతో మెదడులోని న్యూరాన్లు వృద్ధి చెంది, నూతన, పటిష్టమైన సినాప్సెస్ (నాడీకణాలు) వృద్ధికి దారితీస్తాయని అధ్యయనానికి నేతృత్వం వహించిన జోర్ది జుల్వెజ్ చెప్పారు.
బార్సిలోనాలోని 12 స్కూళ్లకు చెందిన 11 నుంచి 16 సంవత్సరాల లోపు వయసున్న 700 మంది విద్యార్ధులపై పరిశోధన నిర్వహించిన అనంతరం ఈ వివరాలను వెల్లడించారు. బాలురు, బాలికలు యుక్తవయసులో క్రమం తప్పకుండా రోజూ వాల్నట్స్ తీసుకోవడం, కనీసం వారానికి మూడు సార్లు వీటిని తీసుకుంటే మెదడు ఆరోగ్యంగా ఎదగడంతో పాటు ఏకాగ్రత సాధించడం తేలికవుతుందని పరిశోధకులు అరిద్న పినర్ పేర్కొన్నారు.
Read More
Yamagata University | మెరుగైన శృంగారంతో దీర్ఘాయువు