Yamagata University | టోక్యో, ఏప్రిల్ 27: మెరుగైన శృంగార జీవితాన్ని గడిపే మధ్య వయస్కులైన పురుషులు ఎక్కువ కాలం జీవిస్తారని జపాన్ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. యమగట యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు పదేండ్ల పాటు 40 ఏండ్లు పైబడిన 8,558 మంది పురుషులు, 12,411 మంది మహిళలపై అధ్యయనం చేసి ఆయుష్షుకు, శృంగార జీవితానికి సంబంధం ఉన్నదని గుర్తించారు.
లైంగిక ఆసక్తి తక్కువగా ఉన్న 40 ఏండ్లు పైబడిన పురుషులకు గుండెజబ్బులతో మరణించే ముప్పు 1.36 రెట్లు, అధికంగా ఉన్నదన్నారు.