Health Tips | ఈ వంటింటి చిట్కాతో శ్వాసకోశ సమస్యలు, ఆస్త్మా, అలర్జీకి చెక్
రోజురోజుకూ పెరుగుతున్న వాయు కాలుష్యంతో పలు అనారోగ్య సమస్యలు (Health Tips) వెంటాడుతున్నాయి. కాలుష్యంతో వాయు నాణ్యతా సూచీ (ఏక్యూఐ) ప్రమాదకర స్ధాయిలకు చేరి స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడం గగనంగా మారుతున్నది.
న్యూఢిల్లీ : రోజురోజుకూ పెరుగుతున్న వాయు కాలుష్యంతో పలు అనారోగ్య సమస్యలు (Health Tips) వెంటాడుతున్నాయి. కాలుష్యంతో వాయు నాణ్యతా సూచీ (ఏక్యూఐ) ప్రమాదకర స్ధాయిలకు చేరి స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడం గగనంగా మారుతున్నది. దీంతో దగ్గు, ఆయాసం సహా పలు శ్వాసకోశ సమస్యలు పెరుగుతున్నాయి. కాలుష్యంతో నిండిన గాలిని పీల్చడంతో ఓజోన్, నైట్రోజన్ డయాక్సైడ్, పర్టిక్యులేట్ మ్యాటర్, డీజిల్ ఎగ్జాస్ట్ పార్టికల్స్‌తో కూడిన హానికారకాలను పీల్చేస్తున్నామని కన్సల్టెంట్ న్యూట్రిషనిస్ట్ రూపాలి దత్తా ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ కాలుష్య కారకాలు మన ఊపిరితిత్తుల్లోకి చొచ్చుకెళ్లి అనారోగ్య సమస్యలను కలిగిస్తున్నాయని చెప్పారు. మన ఊపిరితిత్తుల్లో ఉండే యాంటీఆక్సిడెంట్స్ వీటిని బయటకు పంపుతున్నా యాంటీఆక్సిడెంట్ల సంఖ్య తగ్గినప్పుడు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. కాలుష్య కారకాలు రోగనిరోధక వ్యవస్ధతో పాటు శరీరంలో కణాలపై దాడి చేసి వాపు ప్రక్రియ ముమ్మరం చేస్తాయి. ఫలితంగా దగ్గు నుంచి ఆస్త్మా, క్రానిక్ బ్రాంకైటిస్ వంటి అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి. ఇక శ్వాస సమస్యలకు ఇండ్లలో లభించే పదార్ధంతో చెక్ పెట్టవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
శ్వాస సంబంధ సమస్యలను నివారించి జీర్ణక్రియ సాఫీగా చేస్తూ మలబద్ధకం నివారించేందుకు బెల్లం అద్భుతంగా పనిచేస్తుందని ఇందులో ఉండే అలర్జీ వ్యతిరేక పదార్ధాలు డీటాక్సిఫై చేయడంతో పాటు శ్వాసకోశ కండరాలను రిలాక్స్ చేస్తాయని న్యూట్రిషనిస్ట్, మ్యాక్రోబయాటిక్ హెల్త్ కోచ్ శిల్పా అరోరా చెబుతున్నారు. శరీరంలో ఉండే మలినాలను తొలగించి మలబద్ధకాన్ని నివారిస్తుందని భోజనానంతరం రోజులో ఎప్పుడైనా చిన్న బెల్లం ముక్కను తినడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని శిల్పా అరోరా పేర్కొన్నారు. బెల్లంలో పైటోకెమికల్స్, అత్యవసర పోషకాలు ఉండటంతో ఇది రిఫైన్డ్ షుగర్‌తో పోలిస్తే ఆరోగ్యకరమైన ఎంపికని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
Read More :
Watch: పాముతో ఆటలాడి కాటు వేయాలంటూ తాగుబోతు సవాల్.. పాము కాటుకు మృతి
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

