Watch: పాముతో ఆటలాడి కాటు వేయాలంటూ తాగుబోతు సవాల్.. పాము కాటుకు మృతి
Drunk man challenges snake to bite | మద్యం మత్తులో ఉన్న ఒక తాగుబోతు పాముతో ఆటలాడాడు. తాను శివుడి తండ్రినంటూ ఆ పామును మెడలో వేసుకున్నాడు. తనను కాటు వేయాలంటూ సవాల్ చేశాడు. (Drunk man challenges snake to bite) చివరకు ఆ పాము కాటు వల్ల అతడు మరణించాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
లక్నో: మద్యం మత్తులో ఉన్న ఒక తాగుబోతు పాముతో ఆటలాడాడు. తాను శివుడి తండ్రినంటూ ఆ పామును మెడలో వేసుకున్నాడు. తనను కాటు వేయాలంటూ సవాల్ చేశాడు. (Drunk man challenges snake to bite) చివరకు ఆ పాము కాటు వల్ల అతడు మరణించాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అహిరౌలి గ్రామానికి చెందిన 23 ఏళ్ల రోహిత్ జైస్వాల్ చేతిలో పామును పట్టుకుని ఆటలాడాడు. తాను మహాకాల్ (శివుడు) తండ్రినని, తనను కాటు వేయాలంటూ సవాల్ చేశాడు. పామును మెడలో వేసుకోవడంతోపాటు చేతికి చుట్టుకున్నాడు. సిగరెట్ స్మోక్ చేసిన అతడు ఆ పాముతో నాలుకపై కాటు వేయించుకున్నాడు. ఈ నేపథ్యంలో విషపూరితమైన ఆ పాము కాటు వల్ల అతడు మరణించాడు.
కాగా, ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రోహిత్ జైస్వాల్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబంలో చివరి సంతానమైన అతడికి ఇంకా పెళ్లి కాలేదని తెలిపారు. అతడి తల్లిదండ్రులు సిలిగురిలో నివసిస్తున్నారని, ఇతర సోదరులు గ్రామం వెలుపల పనిచేస్తున్నారని చెప్పారు. మరోవైపు పాము కాటు వల్ల మరణించే ముందు రోహిత్ స్వయంగా రికార్డ్ చేసిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
https://twitter.com/AnbNewstv/status/1721380353179369952?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1721380353179369952%7Ctwgr%5Ef2c3ceb9e2a0366748604f1d9ebac046e0d03d78%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fwww.freepressjournal.in%2Fviral%2Fviral-video-intoxicated-up-man-plays-with-snake-pretending-to-be-lord-shiva-gets-bitten-dies-after-mishandling-it
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

