Monsoon Diet | రుతుపవనాలు జోరుగా కొనసాగుతున్న వేళ.. మన ఆహార విధానంలో కొన్ని మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా ఈ నాలుగు కూరగాయలనూ వర్షాకాలంలో పరిమితంగా తినడమే మంచిదని అంటున్నారు వైద్యులు.
మొక్కలు, ఆకులపై హానికారక సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా తిష్ఠవేసే సమయం ఇది. అందులోనూ, ఆకుకూరలపై వీటి మనుగడ ఎక్కువకాలం ఉంటుంది. అయినా, ఆకుకూరలను తినాలనుకుంటే కచ్చితంగా 30 నిమిషాల పాటు ఉడికించాకే ఆరగించాలి.
ఈ సమయంలో వంకాయలో అనేక రసాయన చర్యలు జరుగుతాయి. కీటకాలు, తెగుళ్ల నుంచి తమను తాము రక్షించుకునేందుకు అవి విష రసాయనాలను ఉత్పత్తి చేస్తాయి. దీనివల్ల దురద, దద్దుర్లు, వికారం, వాంతులు తదితర దుష్ఫలితాలు ఎదురుకావచ్చు.
వేసవిలో ఎంతో మేలు చేసే క్యాప్సికం వర్షాకాలంలో మాత్రం కొన్ని అనారోగ్యాలకు పరోక్షంగా కారణం అవుతుంది. వీటిలోని గ్లూకోసినోలేట్స్ అనే రసాయనాల సమూహం.. నమిలినప్పుడు విషతుల్యంగా మారుతుంది. ఒకవేళ ఉడికించి తిన్నా కూడా కొందరిలో వికారం, వాంతులు, విరేచనాలు, అజీర్తి, శ్వాస సమస్యలకు దారి తీయవచ్చు. కాబట్టి, కొద్దిరోజులు క్యాప్సికంకు పరిమితి విధించడమే మంచిదంటారు.
దీనిలో తేమ శాతం ఎక్కువ. పైగా వీటిలో కూడా గ్లూకోసినోలేట్స్ వంటి హానికారక రసాయనాలు ఉంటాయి. దీనివల్ల, మరీ ముఖ్యంగా వానాకాలం క్యాలీఫ్లవర్ తింటే, అలర్జీ సమస్యలు వెంటాడే ప్రమాదం ఉంది.
వానాకాలంలో పొట్లకాయ, కాకరకాయ, బూడిద పొట్లకాయ, బెండకాయ, సొరకాయ వంటి కూరగాయలు పుష్కలంగా లభిస్తాయి. వీటిని నిరభ్యంతరంగా తినొచ్చు. దోసకాయలు, టమాట, బీన్స్, ఓక్రా కూడా ఒంటికి మేలు చేస్తాయి. వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల పేగుల ఆరోగ్యం మెరుగు పడుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
Health Tips | ఇంట్లోనే ఇమ్యూనిటీ పెంచుకోండిలా..!
Health Tips | వర్షాకాలంలో ఈ ఆహారానికి దూరం!
మీ పిల్లలు తినకుండా మారాం చేస్తున్నారా.. ఈ చిట్కాలు మీకోసమే !!
Breakfast | రోజూ ఉదయం కచ్చితంగా బ్రేక్ఫాస్ట్ చేయాలా?