న్యూఢిల్లీ : వర్షాకాలంలో వేడి వేడిగా స్నాక్స్ తీసుకోవాలని కోరుకుంటారు. అయితే ఈ సీజన్లో పలు అనారోగ్యాలు వెంటాడతాయని కొన్ని ఆహార పదార్ధాలకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఈ సీజన్లో జంక్ ఫుడ్, కార్బొనేటెడ్ డ్రింక్స్ సహా పలు ఆహార పదార్ధాలను తీసుకోవడం మంచిది కాదని చెబుతున్నారు. వర్షాకాలంలో ఇన్ఫెక్షన్ల వ్యాప్తి నేపధ్యంలో ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ఈ సీజన్లో ప్రధానంగా ఈ ఐదు ఆహార పదార్ధాలను తీసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు.
వేపుడు పదార్ధాలు
పుట్టగొడుగులు
ఆకు కూరలు
సీఫుడ్
కార్బొనేటెడ్ డ్రింక్స్