న్యూఢిల్లీ : గత రెండేండ్లుగా మహమ్మారి వెంటాడుతుండటంతో మెరుగైన ఇమ్యూనిటీ ఎంత అవసరమో అందరూ అర్ధం చేసుకున్నారు. అద్భుతమైన రోగనిరోధక శక్తి కలిగిన వారు సాధారాణ అనారోగ్యాలతో పాటు ప్రమాదకర వైరస్ల నుంచి క్షేమంగా బయటపడతారని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ మంచి ఆహారం తీసుకోవడం ద్వారా మెరుగైన ఇమ్యూనిటీ సాధించవచ్చని, బ్రేక్‌ఫాస్ట్‌తోనే దీన్ని ప్రారంభించడం మేలని సూచిస్తున్నారు.
సరైన ఆహారంతో రోజును ప్రారంభిస్తే ఆ రోజంతా ఉల్లాసంగా ఉండటంతో పాటు ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. బ్రేక్‌ఫాస్ట్‌లో ఇమ్యూనిటీని పెంపొందించే ఆహార పదార్ధాలు ఎన్నో ఉన్నాయని వాటిని తీసుకుని ఆరోగ్యంగా చలాకీగా ఉండవచ్చని వైద్య నిపుణులు, పోషకాహార నిపుణులు చెబుతున్నారు. గుడ్డు, తృణ ధాన్యాలు వంటి ప్రొటీన్లు, ఫైబర్ అధికంగా ఉండే ఆహార పదార్ధాలతో రోజును ప్రారంభించాలని పేర్కొంటున్నారు. తాజా పండ్లు, కూరగాయలతో సలాడ్స్‌ను కూడా ప్రయత్నించాలని సూచిస్తున్నారు.
పప్పులు, తృణధాన్యాలు
ప్రొటీన్లు
పసుపు
టీ
పండ్ల రసాలు