స్మార్ట్ఫోన్లు లేని జీవితాన్ని ఊహించలేం! గూగుల్ సెర్చ్ కోసమో, మెయిల్స్ చదవడానికో, సోషల్ మీడియాలో భాగం కావడానికో.. ఏదో ఒక పని కోసం ఉపయోగిస్తూనే ఉంటాం. మితిమీరిన స్మార్ట్ఫోన్ వాడకం వల్ల శారీరక శ్రమ తగ్గి ఊబకాయం, మెడనొప్పి.. లాంటి సమస్యలు వస్తాయనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్మార్ట్ఫోన్ వల్ల ఏమాత్రం ఉపయోగం ఉందో తెలుసుకోవాలని అనుకున్నారు జర్మనీ పరిశోధకులు.
ఇందుకోసం 600 మందికి పైగా అభ్యర్థులను ఎంచుకొని, మూడు భాగాలుగా విభజించారు. మొదటి విభాగంలోని వారు వారంపాటు అసలు స్మార్ట్ఫోన్ జోలికే పోకూడదు. రెండో భాగం వారు రోజుకు గంటసేపు మాత్రమే ఫోన్ చూడాలి. ఇక మిగిలిన వారు యథావిధిగా ఫోన్ చూడవచ్చు. ఈ గడువు పూర్తయిన తర్వాత వీరిలో ఉద్వేగపు స్థాయి, జీవితం పట్ల సంతృప్తి, శరీర శ్రమ, సిగరెట్ లాంటి వ్యసనాలు.. వీటన్నిటినీ నమోదు చేశారు. ఊహించినట్టుగానే స్మార్ట్ఫోన్ వాడకం ఎక్కువగా ఉన్నవారిలో ప్రతికూలమైన ఫలితాలు కనిపించాయి. స్మార్ట్ఫోన్ జోలికి పోనివారికంటే, మితంగా దాన్ని వాడినవారిలో సానుకూల ఫలితాలు కనిపించాయి.
Buddha Diet | బౌద్ధులు తినే భోజనం ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసా!!
మలవిసర్జన తర్వాత టాయిలెట్ పేపర్తో తుడుచుకోవడం బెటరా? కడుక్కోవడం బెటరా?
ఆస్తమా ఉన్న మహిళలకు ఆ టైమ్ చాలా డేంజర్.. ప్రాణాలు కూడా పోవచ్చట!!
Health Tips | వేసవిలో ఈ పండుతో తక్షణ శక్తి..అలసటకు చెక్!