Naga Civilians Shot Dead | మణిపూర్లో ఇద్దరు నాగా పౌరుల కాల్చివేత.. మూడు రోజుల్లో రెండో ఘటన
Naga Civilians Shot Dead | మణిపూర్లో హింసాత్మక సంఘటనలు కొనసాగుతున్నాయి. తాజాగా ఇద్దరు నాగా పౌరులను సాయుధ వ్యక్తులు కాల్చి చంపారు. ఈ కాల్పుల్లో మరో ఇద్దరు నాగా పౌరులు గాయపడ్డారు. భద్రతా దళాలు సంఘటనా ప్రాంతానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించాయి.
ఇంఫాల్: మణిపూర్లో హింసాత్మక సంఘటనలు కొనసాగుతున్నాయి. తాజాగా ఇద్దరు నాగా పౌరులను సాయుధ వ్యక్తులు కాల్చి చంపారు. ఈ కాల్పుల్లో మరో ఇద్దరు నాగా పౌరులు గాయపడ్డారు. భద్రతా దళాలు సంఘటనా ప్రాంతానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించాయి. (Naga Civilians Shot Dead) సేనాపతి జిల్లాలోని కాలెన్జాంగ్ గ్రామంలో ఈ సంఘటన జరిగింది. శనివారం మధ్యాహ్నం గ్రామ పెద్దకు చెందిన ఇంట్లో ఉన్న నాగా పౌరులపై గుర్తు తెలియని సాయుధ వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు నాగా పౌరులు మరణించగా మరో ఇద్దరు గాయపడ్డారు. మృతులను ఆ జిల్లాలోని వేర్వేరు గ్రామాలకు చెందిన రాకీ, కుమార్గా గుర్తించారు. కుకీ తెగకు చెందిన వ్యక్తులు ఈ కాల్పులకు పాల్పడినట్లు స్థానికులు ఆరోపించారు.
కాగా, ఈ కాల్పుల సంఘటన గురించి తెలిసిన వెంటనే పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడి పరిస్థితిని సమీక్షించారు. భారత్-మయన్మార్ సరిహద్దు సమీపంలోని కామ్జోంగ్ జిల్లాలో జరిగిన సాయుధ దాడిలో నలుగురు నాగా పౌరులు మరణించిన రెండు రోజుల తర్వాత తాజాగా ఈ హత్యలు జరిగాయి. ఈ నేపథ్యంలో నాగా ప్రజల భద్రతపై ఆ తెగల సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. మణిపూర్ ముఖ్యమంత్రి యుమ్నామ్ ఖేమ్చంద్ సింగ్ ఈ ఘటనను ఖండించారు. నిరపరాధుల ప్రాణాలపై జరిగిన పిరికిపంద చర్యగా ఆయన అభివర్ణించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Madhya Pradesh | మధ్యప్రదేశ్లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

