నాగర్ కర్నూల్ : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ( Biram Harshavardhan Reddy ) తండ్రి బీరం లక్ష్మారెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ సందర్భంగా ఆదివారం స్వగ్రామమైన సింగోటం గ్రామంలో దశదినకర్మ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ) , మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు జగదీశ్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, విజయుడు , మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్, అంజయ్య యాదవ్, జైపాల్ యాదవ్, చిట్టెంరామ్మోహన్ రెడ్డి తదితరులు బీరం లక్ష్మారెడ్డి చితపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డిని కేటీఆర్ పరామర్శించి ఓదార్చారు.