Constipation : ఆధునిక జీవనశైలిలో మారుతున్న ఆహారపు అలవాట్లు, జంక్ ఫుడ్, నిద్ర లేమి, ఒత్తిడి, వ్యాయామం లేకపోవడం వంటి పలు కారణాలతో మలబద్ధకం సమస్య పలువురిని వెంటాడుతోంది. ఫైబర్ తక్కువగా తీసుకోవడం, డీహైడ్రేషన్, కొన్ని ఆరోగ్య పరిస్ధితుల వలన కూడా ఈ సమస్య జటిలమవుతోంది.
మలబద్ధకం నివారణ, నియంత్రణకు ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం కీలకం. ఫైబర్‌తో కూడిన ఆహారం ప్రేవుల్లో మలాన్ని బయటకు పంపేలా చూడటంతో పాటు మలాన్ని సాఫ్ట్‌గా చేయడంతో మలబద్ధకం సమస్య తీవ్రం కాకుండా చూసుకోవచ్చు.
జీర్ణక్రియ సాఫీగా సాగేలా చేయడంలోనూ ఫైబర్ శరీరానికి అవసరం. ఫైబర్‌ను శరీరం బాగా గ్రహించాలంటే తగినంత నీరు తాగాలి. ఇక ఫైబర్ అధికంగా ఉండే ఆహార పదార్ధాలను పరిశీలిస్తే..
యాపిల్స్
పియర్స్
బెర్రీస్
బీన్స్
తృణ ధాన్యాలు
ఆకు కూరలు
స్వీట్ పొటాటోస్
నట్స్, సీడ్స్
అంజీర్
Read More :
Sea Turtle meat | తాబేలు మాంసం తిని 9 మంది దుర్మరణం.. 78 మందికి అస్వస్థత