Bamboo | మనం నిత్యం అన్నం తింటుంటాం కాబట్టి దాని స్థానాన్ని మరే ఆహారామూ భర్తీ చేయదని అనుకుంటుంటాం. అయితే, మన చుట్టూ ఉన్న వివిధ సమాజాలు రకరకాల ఆహారాలు తీసుకుంటున్న విషయం మరిచిపోతున్నాం. వరి బియ్యంతో చేసిన అన్నం ఒక్కటే కాకుండా చాలా ఆహారాలను మనకు ఆరోగ్యాన్ని చేకూర్చేవిగా ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది వెదురు. వీటి నుంచి బియ్యం తీసి తినడమే కాకుండా వీటి పిలకలను శరీరం బరువు తగ్గించే ఔషధంగా వాడుతుంటారు. ఇవాళ ప్రపంచ వెదురు దినోత్సవం. ఈ సందర్భంగా వెదురుతో ఆరోగ్యం ఎలా సాధ్యమో తెలుసుకుందాం.
సాధారణ వరి బియ్యం మాదిరిగానే వెదురు చెట్లకు పూత వచ్చి కంకులు పడతాయి. వందేళ్లకు ఒకసారి మాత్రమే వెదురు మొక్క పూస్తుంది. అడవుల్లో ఉండే చాలా మంది గిరిజనులు కూడా తమ జీవిత కాలంలో ఎప్పుడూ వెదురు పూవును చూసి ఉండరు. కొన్ని జాతులు 50 ఏండ్లకు ఒకసారి పూస్తుంటాయని వృక్షశాస్త్ర నిపుణులు చెప్తుంటారు.. పూతకు వచ్చి బియ్యం కంకులు వచ్చాయంటే వెదురు మొక్క చనిపోవడానికి సమయం ఆసన్నమైనట్లుగా గుర్తుంచుకోవాలి.

వెదురు బియ్యంలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఇవి తిన్నవారిలో కొలెస్ట్రాల్ శాతం తగ్గుతుంది. విటమిన్ బీ6, పొటాషియం, కాల్షియం, ప్రోటీన్లు, పీచు అధికంగా ఉంటాయి. మధుమేహాన్ని, బీపీని నియంత్రించడంలో గ్రేట్‌గా సహాయపడుతుంది. శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపుతుంది. సంతానోత్పత్తి సామర్ధ్యం పెరుగుతుంది. కీళ్ల నొప్పులను దూరం చేసుకోవచ్చు.
బరువు తగ్గుదల..

Health is possible with bamboo..!
వెదురు పిలకను కూడా ఆహారంగా తీసుకుంటుంటారు. బాగా ఉడికించి వంటల్లో ఉపయోగించాల్సి ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో రెండు, మూడు రోజులపాటు నీటిలో నానబెట్టి తర్వాత పచ్చడి చేస్తారు. మరికొన్ని ప్రాంతాల్లో పులియబెట్టి వాడుతుంటారు. వీటిని శరీరం బరువు తగ్గించుకోవడానికి ఎక్కువగా వాడుతుంటారు. వెదురు పిలకలో పిండిపదార్థాలు, ప్రోటీన్లతోపాటు కాపర్, ఐరన్, ఫాస్పరస్, పొటాషియం వంటి మూలకాలు, రైబోఫ్లెవిన్, విటమిన్ ఏ, కే, ఈ, బీ6 పుష్కలంగా ఉంటాయి. వీటిలో లభించే ఫైటోప్టెరాల్స్, ఫైటోన్యూట్రియంట్స్ కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండెకు ఆరోగ్యాన్నిస్తాయి.
ఈ పిలకల్లో క్యాలరీలు చాలా తక్కువగా, పీచు ఎక్కువగా ఉండటం వల్ల ఇవి మన శరీరం బరువును ఇట్టే తగ్గిస్తాయి. వీటిల్లోని యాంటీఆక్సిడెంట్ల కారణంగా రోగనిరోధకశక్తి పెరుగుతుంది. నాడీసంబంధ వ్యాధులు రాకుండా మనల్ని కాపాడుతుంది. గర్భిణీలు వీటిని తినడం వల్ల గర్భాశయం సంకోచం చెంది కాన్పు తేలికవుతుందని నిపుణులు చెప్తుంటారు. మధుమేహం, డిప్రెషన్, ఊబకాయం తగ్గడానికి కూడా వెదురు పిలకలు దోహదపడుతుంటాయి.
గమనిక: ఈ కథనం కేవలం పాఠకుల అవగాహన కోసమే అందిస్తున్నాం. ఆరోగ్యానికి సంబంధించి ఏ సమస్యకైనా వైద్యులను సంప్రదించడం శ్రేయస్కరం.
ఇవి కూడా చదవండి..