Apricot | ఆప్రికాట్.. ఈ పండు పేరు చెప్పగానే చాలా మంది తెలియదే.. అనే విధంగా ముఖంలో భావన వ్యక్తం చేస్తుంటారు. దీన్నే సీమ బాదం అని, ఖుర్భానీ పండు అని కూడా పిలుస్తారు. ఇది తీపి, వగరు రుచులతో భిన్నంగా ఉంటుంది. అయితే ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం లెక్కలేనంతగా ఇస్తుంది. కాల్షియం, పొటాషియం, ఫాస్పరస్, విటమిన్ ఏ, ఐరన్, విటమిన్ సీ పుష్కలంగా ఉంటాయి. ఆప్రికాట్ పండును తినడం వలన ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. శరీరంలో పెరిగి మనల్ని ఇబ్బంది పెట్టే కొవ్వును తగ్గించుకోవడంతో ఈ పండు చాలా గ్రేట్‌గా పనిచేస్తుంది.