Viral Fevers | ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. వాతావరణంలో అనూహ్య మార్పులతో వైరల్ జ్వరాలు ప్రతీ ఒక్కరినీ పీడిస్తాయి. వానాకాలంలో సీజనల్ వ్యాధులు ఎక్కువగా మనపై దాడి చేస్తుంటాయి. వర్షాలకు చాలా చోట్ల నీరు నిల్వ ఉండి దోమలు తయారై మనకు వైరల్ జ్వరలను తీసుకొస్తాయి. వైరల్ జ్వరాల బారిన పడకుండా ఉండటం ద్వారా ఆరోగ్యంతో పాటు డబ్బును కూడా ఆదా చేసుకోవచ్చు.
వానాకాలంలో వైరస్, బ్యాక్టీరియా యాక్టివ్గా ఉండటం వల్ల వ్యాధులు త్వరగా వ్యాప్తి చెందుతాయి. జలుబు, జ్వరం, దగ్గు వంటి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. జ్వరాలు ఎక్కువగా ఇబ్బంది పెడతాయి. ముఖ్యంగా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండేవారికి మరింత ఇబ్బందికరంగా ఉంటుంది. వానాకాలంలో వచ్చే జ్వరం, దగ్గు, జలుబు, గొంతు నొప్పులను అశ్రద్ధ చేయకూడదు. వాంతులు, కడుపులో నొప్పి రాగానే వైద్యులను సంప్రదించి తగు చికిత్స తీసుకోవాలి.
వైరల్ జ్వరం లక్షణాలు
తీవ్రమైన జ్వరం కనిపిస్తుంది.
గొంతు నొప్పిగా ఉంటుంది.
తీవ్రమైన తలనొప్పి ఉంటుంది.
కీళ్ల నొప్పులు చాలా ఎక్కువగా ఉంటాయి.
కాళ్లు, చేతులు పీక్కుపోతాయి.
వాంతులు అవుతుంటాయి.
కళ్లు ఎర్రబడతాయి. మంటగా ఉంటాయి.
చిన్నారులు, వృద్ధులకు వెంటనే సోకుతుంది.
వెంటనే మందులు వద్దు
వైరల్ జ్వరం వచ్చిన వెంటనే మందులు తీసుకోవద్దు. ముందుగా ఆహారంలో పోషకాలను పెంచాలి. నీరు, సూప్, కొబ్బరి నీరు, చాయ, పప్పు నీరు తీసుకుంటూ ఉండాలి. వైరల్ జ్వరం లక్షణాలు మరీ తీవ్రంగా ఉంటే వెంటనే వైద్యుడ్ని సంప్రదించాలి.
ఇంటి నివారణలు
వైరల్ జ్వరాలను తగ్గించుకోవడానికి ఇంట్లో దొరికే సుగంధ ద్రవ్యాలను వాడొచ్చు.
తేనె, అల్లం, పసుపు కలిపి తీసుకుంటూ ఉండాలి.
నీటిని వేడి చేసుకుని తాగాలి.
వేడినిచ్చే లవంగం, వాము, ఇంగువ, బెల్లం వంటివి తీసుకోవాలి.
ఆకుపచ్చ కూరగాయలు ఎక్కువగా తినాలి.
ఆహారాల్లో వెల్లుల్లి ఎక్కువగా వాడాలి.
వేడి వేడి ఆహారాలనే భుజించాలి.
విటమిన్ సీ పుష్కలంగా ఉండే పండ్లు తీసుకోవాలి.
గమనిక: ఈ కథనం కేవలం పాఠకుల అవగాహన కోసమే అందిస్తున్నాం. ఆరోగ్యానికి సంబంధించి ఏ సమస్యకైనా వైద్యులను సంప్రదించడం శ్రేయస్కరం.