Asian Games : ఆసియా క్రీడల్లో భారత్‌కు అథ్లెటిక్స్‌లో తొలి స్వర్ణం దక్కింది. వరసగా వెండి, కాంస్యాలకే పరిమితమైన మన అథ్లెట్లు 4×400మీ మహిళల టీమ్ ఫైనల్లో పసిడి వెలుగులు విరజిమ్మారు. విద్య రామరాజ్, కిరణ్, ప్రాచీ, పూవమ్మలతో కూడిన మహిళల బృందం అగ్రస్థానంలో నిలిచింది. అంతకుముందు మహిళల హై జంప్‌లో పూజ కాంస్యంతో మెరిసింది. మొత్తంగా.. ప్రస్తుతానికి భారత్ ఖాతాలో 51 పతకాలు చేరాయి.
ఐచీ నగోయ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు పతకాల వేట కొనసాగిస్తున్నారు. షూటింగ్లో నీరూ ధండా (Neeru Dhanda) పసిడి నిరీక్షణకు తెరదించగా.. అథ్లెటిక్స్‌లోనూ మన మహిళలు మెరిశారు. 4×400మీ మహిళల రీలే ఫైనల్లో విద్య రామరాజ్, కిరణ్, ప్రాచీ, పూవమ్మ బృందం సూపర్ షోతో స్వర్ణం ఒడిసిపట్టింది. ఈ ఎడిషన్ అథ్లెటిక్స్‌లో దేశానికి తొలి గోల్డ్ మెడల్ అందించిందీ చతుష్టయం.
FIRST ATHLETICS GOLD IS HERE!!!!! 🤩🇮🇳
Indian 4x400m Women’s Team won the Gold Medal at Asian Games 2026! 🥇
FINALLY, OUR GIRLS DID IT!!!!!!! 🥹 pic.twitter.com/cQqF2VCdHZ
— The Khel India (@TheKhelIndia) September 29, 2026
అంతుకుముందు 4×100 మిక్స్డ్ టీమ్ విభాగంలో భారత బృందం మూడో స్థానంతో కాంస్యం ఒడిసిపట్టింది. గురిందెర్విర్ సింగ్, అనిమేశ్ కుజుర్, స్నేహ శానువలి, హరితా భద్రాల టీమ్.. అదిరే ప్రదర్శనతో 49వ పతకం అందించగా.. కాసేపటికే పూజ హై జంప్‌లో కాంస్యంతో మెరిసింది. 4×400మీ మహిళల రీలే ఫైనల్లో నంబర్ 1గా రావడంతో భారత్ ఖాతాలో స్వర్ణం చేరింది. మొత్తంగా.. భారత్ ఖాతాలో ప్రస్తుతానికి 51 పతకాలున్నాయి.