ఇబ్రహీంపట్నం, జూన్ 20: యోగా (Yoga) ప్రాముఖ్యతను గుర్తించిన విదేశీయులు దేశానికి వచ్చి యోగ్యాభ్యాసం చేస్తున్నారు. రాష్ట్రంలోని హైదరాబాద్‌తో పటు వివిద ప్రాంతాల్లో వెలిసిన యోగా కేంద్రాలకు ప్రత్యేకంగా వచ్చి పరిపూర్ణతను సాధిస్తున్నారు. శరీరంలోని జీవక్రియలను క్రమబద్దీకరించడంతో పాటు వేలాది రూపాయలు వెచించి ఇంగ్లీష్ మందులు వాడినా తొలగని ఎన్నో రోగాలకు యోగా నిపుణులు పరిష్కారం చూపుతున్నారు. రక్తపోటు, మదుమేహం, క్యాన్సర్ వంటి రోగాలకు యోగాసనాలు, ఆహారపు అలవాట్ల మార్పుతో నయంకావడానికి ప్రత్యక్ష అనుభంలోకి తీసుకువస్తుండటంతో అమితాసక్తి కనబరుస్తున్నారు. ప్రాణాయామం, ద్యానం, పంచాక్షరి, మంత్రపఠవం యోగాలో ఒక భాగమే. యోగాతో చక్కటి శరీర సోష్టాన్ని కూడా సొంతం చేసుకునే అవకాశం ఉంది. పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న యువత ధ్యానం అభ్యసించి, పూర్తి ఏకాగ్రతను సాధించే అవకాశం ఉంటుంది. తద్వారా విజయాన్ని గుప్పిటపట్టవచ్చు.
అన్ని రకాల బావోద్వేగాలను ఒడిసిపట్టి సమర్థవంతమైన నాయకుడిగా ఎదిగేందుకు కూడా పలు రకాల యోగా ప్రక్రీయలు ఉపయోగపడుతాయని యోగా నిపుణులు వివరిస్తున్నారు. యోగాతో సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధించేందుకు వేలాది రూపాయలు వెచించి పరికరాలను కొనుగోలు చేయాల్సిన అవసరంలేదు. భారీగా శరీరాకృతికి శ్రమపడాల్సిన పని అంతకన్నా లేదు. పూర్తి ఆసక్తి ఓపికగా అభ్యాసంచేస్తే చాలు. బాల్యదశ నుంచి వృద్దుల వరకు ఎవరైనా యోగాతో ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. యోగాకు ఉన్న విస్తృత ప్రయోజనాల దృష్ట్యా ప్రతి ఒక్కరు ఆచరించేలా అవగాహన కల్పించేందుకు ప్రతి ఏటా జూన్ 21అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. యోగాసనాలకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.
యోగాలో అష్టాంగ స్థితులను క్రమ పద్దతిలో ఆచరిస్తే సత్ఫలితాలు సాధ్యమని యోగా గురువులు సెలవిస్తున్నారు. అవి.
యమ: అహింస, సత్యము, అస్తేయము, హ్మ్రాచర్యము, అపరిగ్రహం, కల్గినదే యమ యోగా. సాధకుడు అనుసరించవల్సిన మొదటి మెట్టుగా దీనిని చెప్పుకోవచ్చు.
నియమ: శౌచము, సంతోషము, తపస్సు, స్వాద్యాయ ఈశ్వర ప్రణిదానము ఇది రెండో మెట్టు యోగా సాదనకుడు మొదట తన మనస్సును అదుపులో పెట్టుకోవాలని అర్థం అంటే యమ నియమలను పాటించాలి.
ఆసన: ఇది శారీరక క్రియ దీనిలో ఆసనాలు అభ్యసనం చేయాలి. నిల్చోని, కూర్చుని, వెల్లకిలా పడుకుని, బోర్లా పడుకుని ఇలా వంద రకాల స్థితులున్నాయి. నిత్యం అభ్యసనం చేయడానికి కొన్ని ఆసనాలను కలిపి, సూర్య నమస్కారాలు అనే క్రియ తయారైంది.
ప్రాణాయమం: ఇది శ్వాసక్రియకు సంబంధించిన ఉచ్చ్వాస, నిశ్వాసల ప్రక్రీయ మన శ్వాసను నియంత్రిచండం ద్వారా శరీరాన్ని అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించడమే ఈ ప్రాణా వ్యాయామం ఉదేశ్యం. ఇదికూడా అనేక తాత్కాలిక రోగాలకు విరుగుడుగా పనిచేస్తుంది.
ప్రత్యాహార: ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవడం. ఆరోగ్యంగా ఉన్న మానవుడి ఇంద్రియాలను అదుపులో పెట్టుకోగలడు. ఇది ఆష్టాంగ యోగా పద్దతుల ద్వారా సులభం. ఇది ఐదో మెట్టు.
దారణ: మనస్సును స్థిరపరచడం, ఇంద్రియాలను అదుపులో పెట్టుకున్నవారికి మనస్సును ఒకే విషయంపై కేంద్రీకరించడానికి సిద్దమవుతుంది.
సమాది: పై ఏడు స్థితుల్లో ఆరితేరిన యోగా సాధకుడికి ఎనిమిదవ స్థితి సాధ్యమవుతుంది. ఇది యోగా సాధనలో చివరిదశ, ఈ స్థితిలో మనిషిలోని జ్ఞానచక్షువు తెరుచుకుంటుంది. దీనినే నిశ్చలస్థితి అని, నిర్వీరాకరస్థితి అని అంటారు.
ఆరోగ్యానికే కాదు అనారోగ్య బాధలు తొలిగిపోవడానికి యోగా దీటైన సాధనమని యోగా సాధకులు సూచిస్తున్నారు.
సాద హస్తవనం: కాలేయం పనితీరు మెరుగుపడుతుంది. మదుమేహ పీడితులు తప్పక వేయాల్సిన ఆసనమిది. అజీర్ణం వ్యాదులు నయమవుతాయి.
త్రికోణాసనం: నాజుగ్గా ఉండాలనుకునే నవతరం అమ్మాయిలకు ఇష్టమైన ఆసనమిది. పిరుదుతు, నడుములోని కొవ్వు తగ్గిపోతుంది. మదుమేహం, శ్వాసకోశ వ్యాదులు మూత్ర సంబంధం జబ్బులు నయమవుతాయి.
మకరాసనం: మెడనొప్పితో బాధపడేవారు వేయదగిన ఆసనమిది. మానసిక ఒత్తిడిలో సతమతమయ్యే వృత్తుల్లో ఉన్నవారికి వరంలాంటిది. పూర్తిగా విశ్రాంతినిస్తుంది.
పవన ముక్తాసనం: దీనికి పొట్టవస్తుందని బాధపడేవారు రోజు ఈ అవకాశాన్ని సాధన చేస్తే సమస్య ఉండదు. అదే విధంగా జీర్ణక్రియ సామర్థ్యం పెరుగుతుంది. మలబద్దకం సమస్య మటుమాలయం.
భుజంగా ఆసనం: ప్రధానంగా వెన్నునొప్పులు తగ్గుతాయి. వీపు నిటారుగా అవుతుంది. మెడ కండరాలు బలపడుతాయి. వెన్నునొప్పి సమస్యతో బాధపడేవారు తరుచుగా ఈ అవకాశాన్ని సాధన చేయడం వల్ల నరాలు బలోపేతం అవుతాయి. వెన్నుముక బలపడుతుంది.
మత్స్యాసనం: శరీరం మనసూ తేలిక పడుతాయి. శ్వాసకోశ వ్యాదులు ఆస్తమా దూరమవుతాయి.
శీర్షాసనం: ఆసనాల్లో రారాజు, వెంట్రుకలు, తెల్లబడకుండా, రాలిపోకుండా కాపాడుతుంది. కళ్లు, ముక్కు, చెవులకు ఆరోగ్యంగా ఉంచుతుంది. బుద్దిని వికసింపజేస్తుంది.
సర్వాంగాసనం: శరీర అవయవాల పనితీరు మెరుగుపడుతుంది. స్త్రీలలో ఋతుసంబంధ సమస్యలు తగ్గుతాయి. థైరాయిడ్ తదితర జబ్బులపైన ప్రభావం చూపుతుంది.