Health Tips : ఆర్యోగ్యకరమైన ఎముకలు, పళ్లు, మెరుగైన రోగనిరోధక శక్తి సహా పలు శారీరక విధులు నిర్వర్తించేందుకు విటమిన్ డీ అత్యంత కీలకం. సూర్యరశ్మి తగిలినప్పుడు మన శరీరం సహజంగానే విటమిన్ డీని తయారుచేసుకుంటాయి. కొన్ని ఆహార పదార్ధాలు, సప్లిమెంట్స్ ద్వారా కూడా విటమిన్ డీని పొందవచ్చు. క్యాల్షియంను శరీరం సరిగ్గా సంగ్రహించాలంటే విటమిన్ డీ అత్యంత అవసరం.
ఎండకు ఎక్స్పోజ్ కానివారు, ఎత్తైన ప్రాంతాల్లో ఉండేవారు, విటమిన్ డీ అధికంగా ఉన్న ఆహార పదార్ధాలు తీసుకోని వారిలో విటమిన్ డీ లోపం తలెత్తుతుంది. విటమిన్ డీ లోపంతో బాధపడేవారు వైద్యుల సలహా మేరకు విటమిన్ డీ సప్లిమెంట్స్‌ను తీసుకోవాలి. ఇక విటమిన్ డీ సప్లిమెంట్స్ తీసుకోవడం ద్వారా ఎముకల ఆరోగ్యం మెరుగవుతుంది.
విటమిన్ డీ లోపిస్తే శరీరం తగినంత క్యాల్షియంను గ్రహించని కారణంగా ఎముకలు బలహీనమవుతాయి. విటమిన్ డీ ఎముకల సాంద్రత, బలాన్ని పెంచి ఆస్టియోపొరోసిస్, ఫ్రాక్చర్ల వంటి వాటిని నిరోధిస్తుంది. విటమిన్ డీ తగినంతగా ఉంటే రోగనిరోధక శక్తి మెరుగవుతుంది. ఇమ్యూనిటీ పెరగడం ద్వారా కోల్డ్, ఫ్లూ, ఇన్ఫెక్షన్స్ వంటి ముప్పు తగ్గుతుంది. ఇక విటమిన్ డీ సప్లిమెంట్స్ ద్వారా చేకకూరే ప్రయోజనాలు పరిశీలిస్తే..
ఎముకల ఆరోగ్యం
రోగనిరోధక శక్తి మెరుగుదల
భావోద్వేగాల నియంత్రణ
గుండె ఆరోగ్యం
కండరాల పనితీరు మెరుగు
బరువు నియంత్రణ
మధుమేహ ముప్పునకు చెక్
మెదడు ఆరోగ్యం మెరుగు
చర్మ సంరక్షణ
Read More :
AIMIM Chief | వక్ఫ్ బోర్డ్ స్వయం ప్రతిపత్తిని తొలగించేందుకు మోదీ సర్కార్ కుయుక్తులు : ఓవైసీ