Health Tips : ఉసిరిగా పేరొందిన ఇండియన్ గూస్బెర్రీలో విటమిన్ సీ పుష్కలంగా ఉండటంతో పాటు శరీరానికి మేలు చేసే యాంటీఆక్సిడెంట్స్ను అత్యధికంగా కలిగిఉంది. రోగనిరోధక వ్యవస్ధ బలోపేతంతో పాటు జీర్ణశక్తిని పెంపొందించడం, గుండె ఆరోగ్యానికి మేలు వంటి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉసిరితో సొంతమవుతాయి.
ప్రధానంగా వేసవిలో ఉసిరి తీసుకుంటే శరీరం డీహైడ్రేషన్ బారినపడకుండా చూసుకోవడంతో పాటు ఇందులో ఉండే శరీరాన్ని శీతలంగా ఉంచే పదార్ధాలు వేడితో పోరాడతాయి. ఉసిరిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఆక్సిడేటివ్ స్ట్రెస్, ఇన్ఫ్లమేషన్ను నివారిస్తాయి.
ఉసిరిలో జీర్ణక్రియ సాఫీగా సాగేందుకు ఉపకరించే ఫైబర్ అధికంగా ఉంటుంది. దీంతో ఉసిరిని తీసుకుంటే మలబద్ధకం సమస్య నివారించడంతో పాటు ప్రేవుల ఆరోగ్యం మెరుగవుతుంది. శరీరం పోషకాలను సవ్యంగా సంగ్రహించే శక్తిని సంతరించుకుంటుంది. ఇక ఉసిరిని ఆహారంలో భాగం చేసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలను పరిశీలిస్తే..
రోగనిరోధక వ్యవస్ధ బలోపేతం
విటమిన్ సీ పుష్కలం
జీర్ణశక్తి మెరుగుదల
గుండె ఆరోగ్యానికి మేలు
చర్మ సంరక్షణ
బరువు నియంత్రణ
కాలేయ పనితీరు మెరుగుదల
ఇన్ఫ్లమేషన్కు చెక్
Read More :
AP News | కౌంటింగ్ సమయంలో అప్రమత్తంగా ఉండాలి.. వైసీపీ శ్రేణులకు సజ్జల పిలుపు