మనుషులన్నాక అప్పుడప్పుడు ఆందోళనగా, బాధగా ఉండటం సహజమే. అయితే అలా ఎక్కువ రోజులు ఉంటేనే మంచిది కాదంటున్నారు వైద్యులు. మీకు బాగా ఇష్టమైన వాటిపట్ల ఆసక్తి కోల్పోయినా, ఎక్కువ రోజులపాటు కుంగుబాటు, నిరాశతో గడుపుతున్నా, లేదంటే ఓ రెండువారాలుగా ఎక్కువ సమయం కుంగుబాటును అనుభవిస్తూ ఉన్నా మీరు ఆత్మీయుల సహాయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైనట్టే.
శరీరం వణకడం, చెమట పట్టడం, కండరాల అదురు, గుండె వేగంగా కొట్టుకోవడం లాంటివి ఆందోళనకు సంబంధించిన లక్షణాలు. దీనికి కొన్నిసార్లు స్వల్పకాలం మందులు తీసుకుంటే సరిపోతుంది. అప్పటికీ తగ్గలేదంటే సమస్య మూలాలను తెలుసుకోవాలి. మంచి థెరపిస్టును సంప్రదిస్తే ఆయన తగిన చికిత్సను సూచిస్తాడు.
ఎవరిని కలవాలి?: ఫ్యామిలీ డాక్టర్. మానసిక వైద్యుడిని కలిస్తే మరీ మంచిది.
చికిత్స: కుంగుబాటు లేదా ఆందోళనను తెలుసుకునేందుకు రోగి ఆరోగ్యం గురించిన ప్రశ్నావళి దోహదపడుతుంది.